బ్యాగ్‌లపై ప్రత్యేకాభిమానం

fashion

 

ఈ మధ్య కాలంలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా ఫ్యాషన్‌పై ఆసక్తి చూపుతున్నారు. కేవలం డ్రెస్సింగ్ విషయంలోనే కాదు యాక్ససరీలలోనూ వీరు ఫ్యాషన్‌గా ఉంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయిలు అబ్బాయిలతో ఫ్యాషన్ విషయంలో పోటీ పడలేక పోతున్నారనుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాగ్స్. కాలేజీ స్టూడెంట్స్, ఉద్యోగస్తుల వరకూ రకరకాల బ్యాగ్‌లపై ప్రత్యేకాభిమానం చూపుతున్నారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు ఎక్కువగా ఇష్టపడుతున్న బ్యాగ్‌లను పరిశీలిస్తే…

టోట్స్..
క్యాజువల్ వర్క్ ఎన్విరాన్‌మెంట్‌లో పనిచేసే ఫ్యాషన్ ప్రియులకు ఇది చాలా బాగుంటుంది. టోట్స్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా కూడా నిలుస్తాయి. లెదర్ టోట్స్‌ను ఎక్కువగా అబ్బాయిలు ఇష్టపడుతుంటారు. ఈ ఒన్‌షోల్డర్ బ్యాగ్‌లు దీర్ఘకాలం నిలిచి ఉండాలంటే మంచి లెదర్ ఎంచుకోవాలి. ధృడంగానూ ఉండాలి. కాఫ్ లెదర్ లేదంటే పెబ్బల్ గ్రెయిన్ ఉంటే బాగుంటుంది. సాలిడ్ న్యూట్రల్ కలర్స్ అయిన బీగ్, కారామల్ బ్రౌన్, బ్లాక్ లేదంటే నేవీ కలర్ బ్యాగ్‌లు ఎంచుకోవాలి.

మెసెంజర్ బ్యాగ్‌లు..
క్యాజువల్ అకేషన్స్‌కు తీసుకువెళ్లగలిగే బ్యాగ్‌లివి. కాలేజీ స్టూడెండ్స్‌కు బాగుంటాయి. ఈవెనింగ్ హ్యాంగవుట్స్ లేదంటే వీకెండ్ ఔటింగ్ వెళ్లేవారికి కూడా బాగానే ఉంటాయి. క్యాజువల్ సందర్భాలలో సైతం బ్యాగ్‌లు వేసుకోవాలనుకునేవారికి వీటి రంగులు ఆకట్టుకుంటాయి.

బ్రీఫ్ కేస్..
నిజం చెప్పాలంటే మగవారికి ఎప్పటికీ నిలిచే ఉండే ఫ్యాషన్ యాక్ససరీ ఇది. ఫ్యాషన్‌లు రావచ్చు.. పోవచ్చు.. మగవారి మదిలో బ్రీఫ్‌కేస్‌కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. బ్రీఫ్‌కేస్ ఎంపికలో శ్రద్ధ చూపకపోతే లుక్స్‌పరంగా కాస్త ఇబ్బంది పడే అవకాశాలున్నాయి.

కెమెరా బ్యాగ్..
స్మాల్ ట్రిప్స్‌కు, సైట్ సీయింగ్స్‌కు వెళ్లినప్పుడు ఈ తరహా బ్యాగ్‌లు ఉపయుక్తంగా ఉంటాయి. కెమెరా లేదంటే లైట్‌వెయిట్ యాక్ససరీలను పెట్టుకోవటానికి దీన్ని వినియోగిస్తారు. లెదర్ ఎక్స్‌టీరియర్ దీనికి వింటేజ్ లుక్‌ని అందించడంతో పాటుగా క్లాసీ ఫీల్‌ను అందిస్తుంది. ఇటీవలి కాలంలో కెమెరాతో పాటుగా బ్యాగ్‌లు కూడా పలు కంపెనీలలో లభిస్తున్నాయి. ఈ బ్యాగ్‌లలో డీఎస్‌ఎల్‌ఆర్, కెమెరా మెసెంజర్ బ్యాగ్‌లు, షోల్డర్ కెమెరా బ్యాగ్‌లు, హోలెస్టర్ప్ వంటివి సాధారణంగా కనిపిస్తుంటాయి. కెమెరా, లెన్స్‌లకు అనుగుణంగా బ్యాగ్‌లను ఎంచుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది.

ట్రావెల్‌బ్యాగ్..
ప్రయాణాలను ఇష్టపడే మగవారు ఎక్కువగా ఇష్టపడేది ఈ బ్యాగ్‌లనే. మన్నిక, శైలితో పాటుగా సౌకర్యపరంగా ఈ బ్యాగ్‌లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీటిలో బ్యాక్‌ప్యాక్‌లు గురించి ఎవరికీ చెప్పనక్కర్లేదు. రెండు స్ట్రాప్స్ అనేవి వీటిలో సంప్రదాయంగా మారాయి. ఇవిగాక డఫెల్స్, రోలర్స్, స్పిన్నర్స్ వంటివి ఉంటాయి.

Girls compete in matter of fashion with boys

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బ్యాగ్‌లపై ప్రత్యేకాభిమానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.