బాయ్‌ఫ్రెండ్ కోసం అక్క నగలు చోరీ

హైదరాబాద్ : కష్టాలలో ఉన్న బాయ్‌ఫ్రెండ్‌ను ఆదుకునేందుకు ఒక యువతి తన అక్క నగలనే చోరీ చేసింది. ఈ సంఘటన బోడుప్పల్‌లోని పీర్జాదీగూడలో జరిగింది. రామంతపుర్‌లో నివసించే ఎం ఝాన్సీ తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఈ నేరానికి పాల్పడింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..తన బాయ్‌ఫ్రెండ్ రాహుల్‌కు డబ్బు అవసరం కావడంతో ఝాన్సీ బోడుప్పల్‌లో నివసించే తన అక్క ఇంటికి వెళ్లి బీరువాలో పెట్టిన బంగారు నగలను చోరీ చేసింది. వాటిని రాహుల్‌కు ఇచ్చింది. తన స్నేహితుడి ద్వారా […] The post బాయ్‌ఫ్రెండ్ కోసం అక్క నగలు చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : కష్టాలలో ఉన్న బాయ్‌ఫ్రెండ్‌ను ఆదుకునేందుకు ఒక యువతి తన అక్క నగలనే చోరీ చేసింది. ఈ సంఘటన బోడుప్పల్‌లోని పీర్జాదీగూడలో జరిగింది. రామంతపుర్‌లో నివసించే ఎం ఝాన్సీ తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఈ నేరానికి పాల్పడింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..తన బాయ్‌ఫ్రెండ్ రాహుల్‌కు డబ్బు అవసరం కావడంతో ఝాన్సీ బోడుప్పల్‌లో నివసించే తన అక్క ఇంటికి వెళ్లి బీరువాలో పెట్టిన బంగారు నగలను చోరీ చేసింది. వాటిని రాహుల్‌కు ఇచ్చింది. తన స్నేహితుడి ద్వారా ఆ నగలను అమ్మి రాహుల్ సొమ్ము చేసుకున్నాడు. ఇంతలో బీరువాలో పెట్టిన నగలు కనపడకపోవడంతో ఝాన్సీ అక్క పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఝాన్సీపై అనుమానం వచ్చి పోలీసులు ఆమెను ప్రశ్నించారు. తానే ఈ నేరానికి పాల్పడినట్లు ఆమె ఒప్పుకోవడంతో పోలీసులు ఝాన్సీతోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను, నగలు అమ్మిన అతని స్నేహితుడిని కూడా అరెస్టు చేశారు.

Girl steals sisters ornaments to help Boyfriend

Police arrested Jhansi and her boyfriend Rahul

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాయ్‌ఫ్రెండ్ కోసం అక్క నగలు చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: