నోయిడాలో దారుణం!

లక్నో: యుపిలోని నోయిడాలో దారుణం జరిగింది. విషం కలిపిన బీరును ప్రియుడితో తాగించిందో ప్రియురాలు. దీంతో యువకుడు చనిపోయాడు. అతడిని చంపేసి ఆపై ఆమె అక్కడి నుంచి ఉడాయించింది. ఘటన వివరాల్లోకి వెళితే… నోయిడాలోని సెక్టార్ 15 మెట్రోస్టేషను వద్ద ఉన్న ఓ గదిలో 21 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడి వద్ద లభించిన ఐడి […]

లక్నో: యుపిలోని నోయిడాలో దారుణం జరిగింది. విషం కలిపిన బీరును ప్రియుడితో తాగించిందో ప్రియురాలు. దీంతో యువకుడు చనిపోయాడు. అతడిని చంపేసి ఆపై ఆమె అక్కడి నుంచి ఉడాయించింది. ఘటన వివరాల్లోకి వెళితే… నోయిడాలోని సెక్టార్ 15 మెట్రోస్టేషను వద్ద ఉన్న ఓ గదిలో 21 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడి వద్ద లభించిన ఐడి ప్రూఫ్ ల ద్వారా అతడిని ఇటావా జిల్లాకు చెందిన అన్షుల్ గా పోలీసులు గుర్తించారు. అన్షుల్ తన ప్రియురాలితో కలిసి హరోల్లా గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో నివాసముండేవాడని స్థానికులు తెలిపారు. అయితే, ప్రియురాలైన యువతి తన ప్రియుడు అన్షుల్ కు విషం కలిపిన బీరు తాగించి పరారైంది. విషం కలిపిన బీరు తాగిన అన్షుల్ చనిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని నిందితురాలైన ప్రియురాలి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments

Related Stories: