బ్యాక్టీరియాను వదిలించుకోండి

  దినచర్యలో భాగంగా మనం వాడే కొన్ని రకాల వస్తువులు హానికరమైన బ్యాక్టీరియాను వ్యాపింపజేస్తాయి. వాటిని తాకినప్పుడు ఆ బ్యాక్టీరియా చేతుల్లోకి ప్రవేశించి, అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఈ సమస్యకుచెక్ పెట్టాలంటే ఏమే చేయాలో చెబుతున్నారు నిపుణులు. * కరెన్సీ నోట్లను సుమారుగా 15 ఏళ్ల పాటు ఉపయోగించేలా తయారు చేస్తారు. ఇవి ఎంతో మంది చేతులు మారుతూ ఉంటాయి. వీటిపైనా క్రిములు ఉంటాయి. వాటిని తాకిన తరువాత చేతులను సబ్బుతో కడుక్కుంటే ఆ బ్యాక్టీరియా […] The post బ్యాక్టీరియాను వదిలించుకోండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దినచర్యలో భాగంగా మనం వాడే కొన్ని రకాల వస్తువులు హానికరమైన బ్యాక్టీరియాను వ్యాపింపజేస్తాయి. వాటిని తాకినప్పుడు ఆ బ్యాక్టీరియా చేతుల్లోకి ప్రవేశించి, అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఈ సమస్యకుచెక్ పెట్టాలంటే ఏమే చేయాలో చెబుతున్నారు నిపుణులు.
* కరెన్సీ నోట్లను సుమారుగా 15 ఏళ్ల పాటు ఉపయోగించేలా తయారు చేస్తారు. ఇవి ఎంతో మంది చేతులు మారుతూ ఉంటాయి. వీటిపైనా క్రిములు ఉంటాయి. వాటిని తాకిన తరువాత చేతులను సబ్బుతో కడుక్కుంటే ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల్ని నివారించొచ్చు.

* బస్సులు, రైళ్లలో ఉండే రాడ్లపై బ్యాక్టీరియా, వైరస్ చేరుతుంది. ప్రయాణం చేసి వచ్చిన తరువాత చేతులను యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్ లేదా సబ్బుతో కడగాలి.
* రెస్టారెంటు మెనూ కార్డులు, ఏటీఎం కేంద్రాలు, రైల్వే, మెట్రో స్టేషన్లలో ఉండే టికెట్ డిస్పెన్సర్ల తెరలను రోజూ చాలా మంది తాకుతూ ఉంటారు. వీటితోనూ క్రిములు వ్యాపించొచ్చని మరవకండి.
* మన ఇళ్లల్లో వంటగదులు క్రిములకు ఆవాసాలు. కూరగాయలు కోసే చాపింగ్ బోర్డులు, శుభ్రపరిచే స్పాంజ్‌లు, పాత్రలను తుడిచే వస్త్రాలపైనా క్రిములు ఉంటాయి. వంట చేసే ముందు, చేశాక… భోజనానికి ముందు, తరువాతా… చేతులను సబ్బుతో కడగాలి.
* పెంపుడు జంతువులను తాకడం, వాటితో ఎక్కువ సేపు ఆడుకోవడం వంటివి చేసినప్పుడు చేతులు కడగడం మర్చిపోకూడదు.

ఎక్కువ కాలం వాడొద్దు
కొన్ని వస్తువుల్ని ఒక్కోసారి ఏళ్ల తరబడి వాడేస్తుంటాం. అలా చేస్తే అనారోగ్యాలు తప్పకపోవచ్చు. అవేంటో తెలుసుకుందాం…
తలగడ : దిండు లేకపోతే నిద్రపట్టదు చాలామందికి. దీన్ని ఏళ్ల తరబడి వాడితే మాత్రం మెడ, తల నొప్పి ఖా యం అంటున్నారు వైద్యులు. దీనిలో ఉండే దూది, ఫోమ్ వంటివి ఎగుడుదిగుడుగా మారి ఈ సమస్యకు కారణం అవుతాయి. రెండేళ్లకోసారైనా వీటిని మార్చాల్సిందే.
బ్రష్‌లు : రోజూ పళ్లు తోముకునే బ్రష్ రంగుమారినా, కుచ్చులే ఊడినా, వంకరపోయినా….అలానే వాడేస్తుంటారు చాలామంది. కానీ వీటిని కనీసం మూడు నెలలకోసారైనా మార్చాల్సిందేనట. లేదంటే అవి పళ్లకు హానికరంగా మారతాయి. చిగుళ్లను గాయపరుస్తాయి.
దువ్వెనలు : వీటిని ప్రతి పదిరోజులకోసారి శుభ్రం చేయాలి. దానికి వేణ్నీళ్లు వాడాలి. ఏడాదికి మించి ఎక్కువ కాలం వీటిని వాడకూడదు. ఇలా వాడటం వల్ల జుట్టు తెగిపోవడం, మాడుకి గాయాలు కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
లో దుస్తులు : ఇవి ఒంటికి అతుక్కొని ఉండటం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. కనీసం ప్రతి ఆరు నెలలకోసారైనా వీటిని మార్చకపోతే అలర్జీలు వచ్చే ప్రమాదం ఎక్కువట.

Get rid of Bacteria with Hygiene

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బ్యాక్టీరియాను వదిలించుకోండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: