గాయత్రి ఐదోపంపు వెట్ రన్

ఈ వారంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా అధికారిక ప్రారంభం మన తెలంగాణ/హైదరాబాద్: ఈఫిల్ టవర్ ఎత్తును మించిన పొడవుతో, తెలంగాణ రైతన్న నీటి గోసను తీర్చడానికి గాయత్రి (లక్ష్మీపూర్) పంపుహౌజ్‌ను మేఘా ఇంజనీరింగ్ తీర్చిదిద్దింది. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ఆవిర్భవించిన ప్రత్యే క తెలంగాణ రాష్ట్రంలో గాయత్రి పంపుహౌజ్ సైతం ప్రత్యేకతల సమాహారంగా రూపుదిద్దుకుంది. ప్రపంచంలోనే గొప్ప ఇంజనీరింగ్ కళాఖండంగా భావిస్తున్న ఈ పంపుహౌజ్ ప్రారంభానికి వీలుగా మెగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక […] The post గాయత్రి ఐదోపంపు వెట్ రన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఈ వారంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా అధికారిక ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్: ఈఫిల్ టవర్ ఎత్తును మించిన పొడవుతో, తెలంగాణ రైతన్న నీటి గోసను తీర్చడానికి గాయత్రి (లక్ష్మీపూర్) పంపుహౌజ్‌ను మేఘా ఇంజనీరింగ్ తీర్చిదిద్దింది. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ఆవిర్భవించిన ప్రత్యే క తెలంగాణ రాష్ట్రంలో గాయత్రి పంపుహౌజ్ సైతం ప్రత్యేకతల సమాహారంగా రూపుదిద్దుకుంది. ప్రపంచంలోనే గొప్ప ఇంజనీరింగ్ కళాఖండంగా భావిస్తున్న ఈ పంపుహౌజ్ ప్రారంభానికి వీలుగా మెగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సామర్థం ఉన్న పంపులు 139 మెగావాట్లను ఉపయోగిస్తూ 111 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాలన్న సంకల్పం ఆది, సోమ వారాల్లో నిజరూపం దాల్చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన 5వ నంబరు పంపును ఆది, సోమ వారాల్లో వెట్న్‌న్రు విజయవంతంగా జరిపారు. ఈ వారంలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేకరరావు చేతుల మీదుగా పంపుహౌజ్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. అప్పటి వరకు మరిన్ని పంపులను మనుగడలోకి తీసుకువచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రైతుల అవసరాలు తీర్చడానికి, గోసను రూపుమార్పడానికి నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎంత ఎత్తుకైనా తీసుకుపోవచ్చన్న సంకల్పానికి గాయత్రి పంపుహౌజ్ బలంగా మారనుంది. 5వ పంపు వెట్న్ విజయవంతం కావడంతో సుమారు 3000 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా 111 మీటర్ల ఎగువకు ఎగజిమ్మింది. ఉవ్వెత్తున లేచివచ్చిన నీటితో దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ఈ వారంలోనే 4, 5 పంపులను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది.
దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నాడు పంపు 52 నిముషాల సేపు పంపును నడిపించారు. సోమవారం నాడు సైతం 45 నిముషాలను పంపును నడిపారు. పంపును విజయవంతంగా వెట్న్ చేసిన నేపధ్యంలో మేఘా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ‘ తెలంగాణకు ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం తమ సంస్థకు దక్కిర గౌరవని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల సాగునీటి గోసను తీర్చేందుకు ప్రపంచంలోనే అత్యత్తుమ ఇంజనీరింగ్ సంస్థలతో కలిసి పనిచేయడం, అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడం మాకు లభించిన జీవితకాలపు అవకాశంగా, గౌరవంగా భావిస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్ పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతి అంశం చర్చించి, ప్రోత్సహించడం వల్లనే సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయడం సాధ్యమైందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
మేఘా మహాద్భుత సృష్టి
ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. ఇంతకు ముందెన్నడూ లేనిది. అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్థాల ప్రకారం, నీటి పంపింగ్ లక్షం, పరిమాణం.. ఇలా ఏ ప్రకారం చూసినా, గాయత్రి పంపుహౌజ్ ఇంజనీరింగ్ కళాఖండం. మానవ నిర్మిత ప్రపంచ అద్భుతాల్లో చేరే అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఒక్కో మిషన్ వారీగా చూస్తే సామర్థం 139 మెగావాట్లు కావడంతో ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే పెద్ద మిషన్. ఒక మొత్తం పంపింగ్ కేంద్రం ప్రకారం చూసినా 973 మెగావాట్లు కూడా అతి పెద్దది. ఇందులో వినియోగించిన ఎలక్ట్రికల్ మోటార్ పంపుహౌజ్‌లలో కాకుండా మొత్తంగా ప్రపంచంలో ఏ రంగంలోనూ ఇంత పెద్దది లేదు.

దీన్ని బట్టే పంపింగ్ కేంద్రం స్థాయి తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 2 టిఎంసిల పంపింగ్‌కు గాను మొత్తం 4627 మెగవాట్ల పంపింగ్ సామర్థం అవసరం. ఇందులో 3057 మెగావాట్ల పంపింగ్ సామర్థం కలిగిన పంపులను ఏర్పాటు చేసింది మేఘా సంస్థనే కావడం గమనార్హం. సాగునీటి రంగంలో ఎత్తిపోతల పథకంలోని పంపులకు ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ సామర్థం వ్యవస్థను ఏర్పాటు చేయడం ఓ రికార్డు. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ భారీ స్థాయిలో వ్యవస్థ ఏర్పాటు చేయలేదు.
మూడున్నరేళ్లలోనే..
ఎత్తిపోతల పథకాలే ఇంత పెద్ద స్థాయిలో, భారీ పంపులతో కూడిన ప్రాజెక్టును ఎక్కడా నిర్మించలేదు. రోజుకు 2 టిఎంసిల నుంచి గరిష్టంగా 4.5 టిఎంసిలను కూడా 111.4 మీటర్ల ఎగువకు ఎంపింగ్ చేయడం అనేది అసామాన్యమైంది. సమాళ్లను ఎదుర్కొని మేఘ ఇంజనీరింగ్ ఈ పంపింగ్ కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చింది. కేవ లం మూడున్నరేళ్లలోనే ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. దశాబ్ధాలుగా ప్రాజెక్టులు సాగుతాయనే భావనల మధ్య గాయత్రి పంపింగ్ కేంద్రాన్ని యుద్ధప్రాతిపదికన వేగంగా నిర్మించి, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
ప్రపంచ ప్రాజెక్టులే చిన్న బోయేలా…
గాయత్రి భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం పొడవు ఈఫిల్ టవర్ పొడవు కన్నా ఎక్కువ. ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు కాగా, ఈ పంపుహౌజ్ పొడవు 327 మీటర్లు. కలకత్తాలో ఉన్న దేశంలోనే అతి పొడవైన భవంతి ‘ది 42’ కంటే ఈ పంపు హౌజ్ లోతు ఎక్కువ. భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు. దీని నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.3 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని బయటికి తీశారు. సర్జ్‌పూల్ సైతం ఈఫిల్‌టవర్ కన్నా పొడవైంది. ఇప్పటి వరకు ప్రపంచంలో కొలరాడో (అమెరికా), గ్రేట్ మేన్‌మేడ్ రివర్ (లిబియా) లాంటి ఎత్తిపోతల పథకాలే పెద్దవి కాగా, కాళేశ్వరం ప్రారంభంతో ఆ ప్రాజెక్టులు చిన్నబోనున్నాయి.
బరువైన మిషన్లు
ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థంతో 5 మిషన్లను పంపింగ్‌కు సిద్ధం చేయగా, ఇవి ఎంత పెద్దవంటే అనుబంధ పరికరాలతో కలిపి ఒక్కో మిషన్ బరువు 2376 మెట్రిక్ టన్నులు. ఒక్కో లారీలో 20 టన్నుల సరుకు రవాణా చేస్తుంటారు. మిషన్‌లో ప్రధానమైనవి స్టార్టర్, రోటర్లు, స్టార్టర్ బరువే 216 టన్నులు కాగా, రోటర్ బరువు 196 టన్నులు. సాధారణంగా 200 టన్నుల బరువు మోసే క్రేనులే అరుదు. పంపింగ్ కేంద్రంలో వీటిని కదిలించడానికి రెండేసి క్రేన్లను వినియోగంచడం గమనార్హం. తద్వారా 300 టన్నులు బరువు మోయగలిగిన ఇఓటి క్రేన్ సముదాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ పంపుహౌజ్ నిర్మాణంలో 6 వేల టన్నుల స్టీల్‌తో పాటు 50 వేట టన్నుల సిమెంట్ కాంక్రీట్‌ను వినియోగించారు.
ఇక్కడి నుంచి రోజుకు 2 టిఎంసిల నీటిని పంపింగ్ చేసే విధంగా నిర్మాణం పూర్తయ్యింది. జంట సొరంగాలను పక్కపక్కనే 10 మీటర్ల వ్యాసార్థంతో తవ్వి నిర్మించడం, దీనికి అనుబంధంగా సర్జ్‌పూల్, అదనపు సర్జ్‌పూల్ నిర్మించారు. భూగర్భంలో నిర్మించిన ఈ సర్జ్‌పూల్ సైతం 327 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో 65 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. ఈ పంపుహౌజ్ నుంచి నీటిని ఏకంగా 111.4 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేసేలా మిషన్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థకు దేశీయ మహా నవరత్న కంపెనీ బిహెచ్‌ఇఎల్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విదేశీ కంపెనీలు టెల్క్, సీమెన్స్, వార్టిలా, ఎంఎంటి, ఎల్‌ఎస్ కేబుల్స్, హిల్టి, అట్లాస్ కోప్కో, నార్మెట్, సాండ్‌విక్ తదితర సంస్థలు తమ సేవలు అందించాయి. 160 ఎంవిఎ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఒక్కో మిషన్‌కు ఒక్కోటి చొప్పున అమర్చారు. 400 కెవిఎ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ భూగర్భ కేబుళ్ల ద్వారా మిషన్లకు సరఫరా అవుతుంది.
ఇదో అద్భుతం: మేఘా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
ప్రపంచంలోనే అతి పెద్ద పంపుహౌజ్‌ను అతి స్వల్ప కాలంలో పూర్తిచేసిన సందర్భంగా మేఘా ఇంజనీరింగ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఇదో అత్యధ్భుతమైన భూగర్భ పంపుహౌజ్. భూమికి 470 అడుగుల దిగువన జంట సొరంగాలతో పాటు ప్రపంచంలోనే అతి పెద్ద సర్జ్‌పూళ్లు నిర్మించాం. ఈ అల్ట్రా మెగా ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్థం ఉన్న 5 మిషన్లతో రోజుకు 2 టిఎంసిల నీటిని పంపింగ్ చేసేలా నిర్మించాం. ఈ మిషన్లు కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సిఎఫ్‌డి) టెక్నాలజీతో దేశంలోనే తయారు చేసి మేక్ ఇన్ ఇండియాకు ప్రతిరూపంగా ఈ పంప్‌హౌజ్‌ను నెలకొల్పాం. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతి పెద్ద విద్యుత్ మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఏ రకంగా చూసినా ఇది ప్రపంచంలోనే వినూత్నమైన మెగా ప్రాజెక్టు అన్నారు. దీన్ని వేగవంతంగా పూర్తిచేసిన ఘనత మేఘా ఇంజనీరింగ్‌కే దక్కుతుంది’ అని సంతోషం వ్యక్తపరిచారు.

Gayatri Pump House is designed by Megha Engineering

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గాయత్రి ఐదోపంపు వెట్ రన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: