సకల వేద స్వరూపం గాయత్రీదేవి

  ‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్’ శరన్నవరాత్రులలో మూడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి అమ్మవారే. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని పెద్దలు చెబుతారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గధ, అంకుశం ధరించి […] The post సకల వేద స్వరూపం గాయత్రీదేవి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్’

శరన్నవరాత్రులలో మూడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి అమ్మవారే. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని పెద్దలు చెబుతారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గధ, అంకుశం ధరించి అమ్మ భక్తులకు దర్శనమిస్తుంది.

ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలములో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతాయి. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేసి రవ్వ కేసరి, పులిహోర నైవేద్యంగా అమ్మకు సమర్పించాలి.

అమ్మవారి నైవేద్యాలు

రవ్వ కేసరి

కావాల్సినవి:1 కప్పు ఉప్మారవ్వ, ఒకటిన్నర కప్పుల చక్కెర, రెండున్నర కప్పుల నీరు, ఐదు, ఆరు కుంకుమ తంతువులు, 4 టేబుల్ స్పూన్లు కరిగిన నెయ్యి, వెన్న, కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్ మిస్, 3/4 స్పూన్ యాలకుల పొడి.

తయారీ : పాత్రను వేడి చేసి, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో, ఉప్మా రవ్వ వేసి లేత గులాబీ రంగు వరకు వేయించాలి. వాటిని కలుపుతూ ఉండాలి, వేడిని ఆపివేసి, చక్కెర వేసి కలపాలి. నీరు పోసి చిన్న మంట మీద ఉడికించాలి. కుంకుమ పువ్వు, ఎండుద్రాక్షలో సగం వేసి కలిపి ఒక నిమిషం చిన్న మంట మీద ఉడికించాలి. వెచ్చని నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసి కలపాలి. మంటను ఆపివేసి, వడ్డించే గిన్నెలోకి తీయండి. మిగిలిన జీడిపప్పు, కిస్‌మిస్‌తో అలంకరిస్తే సరిపోతుంది.

 

పులిహోర

కావాల్సినవి : బియ్యం – 150 గ్రాములు (3/4 కప్పు), నీరు -300 గ్రాములు (1 1/2 కప్పులు), చింతపండు- 20 గ్రాములు, పచ్చి శనగపప్పు- 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు ఒక టేబుల్ స్పూన్, మెంతులు 1/8 టేబుల్ స్పూన్, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 3, ఎండు మిర్చి 3, పసుపు 1/4 టేబుల్ స్పూన్, కరివేపాకు, ఇంగువ- చిటికెడు, పల్లీలు – 2 టేబుల్ స్పూను, రుచికి సరిపడా ఉప్పు, నూనె- 3 టేబుల్ స్పూన్లు.

విధానం : బియ్యాన్ని ఉడికించాలి. చింతపండు గుజ్జుతీసి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన అన్నంలో పసుపు కలిపి ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి దాంట్లో పల్లీలను వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో మెంతులు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసి వేగాక, చింతపండు గుజ్జు కూడా వేయాలి. ఆ మిశ్రమం ఉడికాక దాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి.

Gayatri Devi is Embodiment of all Vedas

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సకల వేద స్వరూపం గాయత్రీదేవి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: