కోహ్లీ వ్యాఖ్యలను వ్యతిరేకించిన గవాస్కర్

ముంబయి: జట్టులో నాలుగో స్థానంలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను కొనసాగించాలని టీమిండియా భావిస్తోందని కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వ్యతిరేకించాడు. విండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్‌డేలో రిషబ్ పంత్(20) మరోసారి నిరాశపర్చగా శ్రేయస్ అయ్యర్ (71) విలువైన అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. రోహిత్(18), పంత్‌లు ఔట్ అవడంతో అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ కోహ్లీకి జతగా నిలిచాడు. వీరిద్దరూ అయిదో వికెట్‌కు 125 పరుగులు […] The post కోహ్లీ వ్యాఖ్యలను వ్యతిరేకించిన గవాస్కర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: జట్టులో నాలుగో స్థానంలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను కొనసాగించాలని టీమిండియా భావిస్తోందని కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వ్యతిరేకించాడు. విండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్‌డేలో రిషబ్ పంత్(20) మరోసారి నిరాశపర్చగా శ్రేయస్ అయ్యర్ (71) విలువైన అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. రోహిత్(18), పంత్‌లు ఔట్ అవడంతో అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ కోహ్లీకి జతగా నిలిచాడు. వీరిద్దరూ అయిదో వికెట్‌కు 125 పరుగులు జోడించి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. శ్రేయస్ అయ్యర్ రెండో వన్‌డేలో తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని, నాలుగో స్థానంలో పంత్‌కన్నా అతనే సరిగ్గా సరిపోతాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

ధోనీ లాగే పంత్ కూడా ఆరు, ఏడు స్థానాల్లో మ్యాచ్ ఫినిషర్‌గా పనికొస్తాడని, ఆ స్థానాలే అతడి ఆట శైలికి సరిపోతాయని చెప్పుకొచ్చాడు. ఒక వేళ టాప్ ఆర్డర్ 30 35 ఓవర్లలోనే ఔటయితే అయ్యర్ ముందుగా రావాలని చెప్పుకొచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌తో మిడిలార్డర్‌లో అయ్యర్ స్థానం పదిలం కావాలని, లేకపోతే ఏం జరుగుతుందో ఊహించడం కష్టమని గవాస్కర్ అన్నాడు. ఈ సిరీస్‌కు ముందు విండీస్‌ఎతో జరిగిన అనధికారిక అయిదు వన్‌డే మ్యాచ్‌లలోను అయ్యర్ రాణించిన విషయాన్ని ఆయన గుర్తుచేశాడు.

Gavaskar disagree with Kohlis decision on No.4 batsman

The post కోహ్లీ వ్యాఖ్యలను వ్యతిరేకించిన గవాస్కర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: