అర్ధరాత్రి ఇంట్లో నుంచి లాక్కెళ్లి…. పత్తి చేనులో వివాహితపై గ్యాంగ్ రేప్

  ఖమ్మం: ఓ వివాహితను కిడ్నాప్ చేసి అనంతరం ఆమెపై ఏడుగురు అత్యాచారం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వివాహిత తన ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు యువకులు ఆమె నోరు మూసి బలవంతంగా గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. యువతి ఇంట్లో అలజడి కావడంతో పక్కింటి వ్యక్తి ఆ నిందితులను అనసరించడమే కాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం ఆ ఇద్దరుతో పాటు మరో ఐదుగురు […] The post అర్ధరాత్రి ఇంట్లో నుంచి లాక్కెళ్లి…. పత్తి చేనులో వివాహితపై గ్యాంగ్ రేప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం: ఓ వివాహితను కిడ్నాప్ చేసి అనంతరం ఆమెపై ఏడుగురు అత్యాచారం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వివాహిత తన ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు యువకులు ఆమె నోరు మూసి బలవంతంగా గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. యువతి ఇంట్లో అలజడి కావడంతో పక్కింటి వ్యక్తి ఆ నిందితులను అనసరించడమే కాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం ఆ ఇద్దరుతో పాటు మరో ఐదుగురు పత్తి చేనులోకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు వచ్చేసరికి నిందితులు పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి బాధితురాలును ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులు బానోత్ మోహన్, బానోత్ ఉపేందర్, అంగోతు కల్యాణ్, బానోత్ చంటి, అజ్మీరా నాగేశ్వర్ రావు, మాలోతు అశోక్, బి. సునీల్‌గా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. బాధితురాలు బంధువులు, గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

Gang Rape on Women by Seven members in Khammam

The post అర్ధరాత్రి ఇంట్లో నుంచి లాక్కెళ్లి…. పత్తి చేనులో వివాహితపై గ్యాంగ్ రేప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: