బై.. బై.. గణేషా

గణనాథుల నిమజ్జనంకు భారీగా ఏర్పాట్లు భారీగా పోలీసు బందోబస్తు.. మద్యం దుకాణాలకు సెలవు నేడు బాలాపూర్ గణనాథుడి మహిమాన్విత లడ్డూ వేలం గత ఏడాది రూ.16.60లక్షల రికార్డు ధర పలికిన లడ్డూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న వేలం లడ్డూ ధరపై సర్వత్రా ఆసక్తి గంగమ్మ తల్లి ఓడికి చేరడానికి గణనాథుడు సిద్ధమయ్యారు. తొమ్మిది రోజులుగా ఆశేష భక్తుల పూజలం దుకున్న విఘ్నేశ్వరుడు ఇక బై బై చెప్పడానికి భక్తులు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైద్రాబాద్, […] The post బై.. బై.. గణేషా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గణనాథుల నిమజ్జనంకు భారీగా ఏర్పాట్లు
భారీగా పోలీసు బందోబస్తు.. మద్యం దుకాణాలకు సెలవు
నేడు బాలాపూర్ గణనాథుడి మహిమాన్విత లడ్డూ వేలం
గత ఏడాది రూ.16.60లక్షల రికార్డు ధర పలికిన లడ్డూ
ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న వేలం
లడ్డూ ధరపై సర్వత్రా ఆసక్తి

గంగమ్మ తల్లి ఓడికి చేరడానికి గణనాథుడు సిద్ధమయ్యారు. తొమ్మిది రోజులుగా ఆశేష భక్తుల పూజలం దుకున్న విఘ్నేశ్వరుడు ఇక బై బై చెప్పడానికి భక్తులు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైద్రాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలో గల్లీ గల్లీలో వెలసిన వినాయక విగ్రహాలను గురువారం నాడు నిమజ్జనం చేయడానికి అధికార యంత్రాంగం గత కొన్ని రోజులుగా ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు కొనసాగిస్తుంది. బాలాపూర్ వినాయక ఉరేగింపులో పాల్గొని సందడి చేయాలని ఉమ్మడి జిల్లా పరిధిలోని అనేక ప్రాంతాలలో 5, 7 రోజులలో వినాయకుల నిమజ్జనం పూర్తి చేసుకుని నేడు నిర్వహించే మహ ఉరేగింపుకు సిద్ధమవుతున్నారు. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ వినాయకుడి ఉరేగింపు ప్రారంభం అయిన అనంతరమే హైద్రాబాద్‌లోని వినాయకుల ఉరేగింపు ప్రారంబం కానుంది.

హైదరాబాద్ : రంగారెడ్డి, మేడ్చల్ జి ల్లాల పరిధిలోని వినాయక విగ్రహాలను ట్యాంక్‌బండ్‌కు తరలించకుండా జిల్లాలోని శివారు ప్రాంతాల్లో పలు చెరువులలో నిమజ్జనం కు ఏర్పాట్లు చేశారు. సరూర్‌నగర్ చెరువు, రాయదుర్గం దుర్గం చెరు వు, హఫీజ్‌పేట్ కేదమ్మ కుంట, రాజేంద్రనగర్‌లో పత్తికుంట, మ న్సూరాబాద్ పెద్ద చెరువు, నెక్నాంపూర్ పెద్ద చెరువుతో పాటు శివారులో 23 చెరువుల వద్ద అధికారులు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చే శారు. వినాయక నిమజ్జనం బందోబస్తు కోసం సైబారాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశా రు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించి గస్తీ చేపడుతుండటంతో పాటు సకాలంలో వినాయక విగ్రహాలను మండపాల నుంచి తరలించేందుకు స్థానిక పోలీసులు కృషి చేస్తున్నారు. జంట నగరాలతో పా టు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో గురువారం నాడు సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా మద్యం దుకాణాలు, బార్‌లకు సెలవుదినంగా ప్రకటించారు.

గ్రామీణ ప్రాంతాలలో…

ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ మండలాల్లో ఇప్పటికే పలు వినాయకులను నిమజ్జనం పూర్తి చేసిన మిగత వాటిని గురువారం నాడు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లాలో పలు చెరువులలో నీరు లేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాల నుంచి వినాయక విగ్రహాలను నాగార్జునసాగర్, శ్రీశైలం, మంత్రాలయం, భద్రాచలంతో పాటు పలు పుణ్యక్షేత్రాలకు తీసుకు పోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

బాలాపూర్ వినాయకుడి వేలంపై అందరి దృష్టి…

లడ్డు వేలం అనగానే అందరికి టక్కున గుర్తుకు వచ్చే బాలాపూర్ వినాయక లడ్డు మాత్రమే. గత పది సంవత్సరాలకుపైగా ప్రతి యేడు అంచనాలకు అందకుండా అధికంగా ధర పలుకుతున్న బాలాపూర్ లడ్డు వేలం నేడు ఎంత పలుకుతుందో అన్న చర్చ జోరుగా సాగుతుంది. 1994లో కొలను మోహన్ రెడ్డి రూ.450కి లడ్డును వేలం పాటలో దక్కించుకోగా నాటి నుంచి నేటి వరకు పెరగడం తప్ప ఎనా డు లడ్డు ధర తగ్గలేదు. 2016లో స్కైలాబ్ రెడ్డి రూ. 14.65 లక్షలు, 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15.60 లక్షలకు లడ్డును దక్కించుకోగా గత సంవత్సరం ఆర్య వైశ్య సంఘం నాయకుడు శ్రీనివాసు గుప్తా రూ.16.60 లక్షలకు లడ్డును వేలం పాటలో దక్కించుకున్నారు. నేడు జరగనున్న వేలం పాటలో గత రికార్డులు ఖచ్చితంగా బ్రేక్ జరిగి కొత్త రికార్డు నమోదు అవడం ఖాయమని స్థానికులు విశ్వసిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో గత వారం రోజులుగా చిన్న చిన్న గ్రామాల్లో సైతం లడ్డు వేలం లక్షలకు చేరుతుండటంతో బాలాపూర్ లడ్డు వేలం మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.

Ganapati Visarjan 2019

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బై.. బై.. గణేషా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: