ఆటలతో చదువుకు పునాది…

  ఆడుతూ పాడుతూ అన్నీ నేర్చుకోవాలి అంటుంటారు పెద్దవాళ్లు. హాయిగా ఆటలాడుతూ, అచ్చం ఆటలాగే చదువు నేర్చుకుంటే వంటపడుతుంది అంటారు చైల్డ్ సైకాలజిస్టులు. ఇప్పుడు పిల్లలకు సెలవులే. అయినా వాళ్లు హాయిగా పగలంతా ఆటల్లో మునిగి తేలే అవకా శం లేదు. వాళ్లకోసం ఈ సమ్మర్ క్యాంప్‌లు ఎదురుచూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించేవాళ్లు కూడా పాత పద్ధతినే పట్టుకుంటున్నారు. ఏదైనా ఆడుతూ నేర్చుకోవటం, ఆటలతో పాఠాలు కలిపి చెప్పటం ఇది కొత్త కాన్సెప్ట్. […] The post ఆటలతో చదువుకు పునాది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆడుతూ పాడుతూ అన్నీ నేర్చుకోవాలి అంటుంటారు పెద్దవాళ్లు. హాయిగా ఆటలాడుతూ, అచ్చం ఆటలాగే చదువు నేర్చుకుంటే వంటపడుతుంది అంటారు చైల్డ్ సైకాలజిస్టులు. ఇప్పుడు పిల్లలకు సెలవులే. అయినా వాళ్లు హాయిగా పగలంతా ఆటల్లో మునిగి తేలే అవకా శం లేదు. వాళ్లకోసం ఈ సమ్మర్ క్యాంప్‌లు ఎదురుచూస్తూ ఉంటాయి.

ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించేవాళ్లు కూడా పాత పద్ధతినే పట్టుకుంటున్నారు. ఏదైనా ఆడుతూ నేర్చుకోవటం, ఆటలతో పాఠాలు కలిపి చెప్పటం ఇది కొత్త కాన్సెప్ట్. స్కూళ్లంటే పిల్లలకు ఇష్టం పెంచే విధానం. కార్పొరేట్ విద్యాభ్యాసంలో పిల్లలకు ఆట లు ఉండవు. ఉదయం ఏడుగంటలకే స్కూలుకు వెళ్లే మూడ్‌లోకి పిల్లలు వచ్చేస్తే సాయంత్రం వరకు చదువే చదువు. రాయటం, బట్టీ వేయించటం, మార్కులు, నెలనెలా పరీక్షల రిపోర్ట్‌లు, పేరెంట్స్ మీట్… పిల్లలకు ఒక శిక్షలాంటి చదువుసాగుతుంది. పిల్లల ఎదుగుదలకు అవసరం అయ్యే వ్యాయామం ఎక్కడా లేదు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలలో తగ్గిపోతున్న వ్యాయామాల గురించి, ఆటల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన పడుతోంది. పిల్లల ఆరోగ్యానికి వారు చేసే శారీరక శ్రమకు సంబంధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. శారీరక వ్యాయామం, ఆటలు శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎంతో మేలుచేస్తాయి. వాళ్లకు ప్రత్యేక వ్యాయామం అవసరం లేదు. వాళ్లని ఆడుకోనిస్తే చాలు. శరీరం ఒక క్రమపద్ధతిలో కదులుతూ కండరాలకు పనిచెప్పి శక్తి వినియోగించేది ఏదైనా వ్యాయామమే. ఆటలతో ఒక క్రమపద్ధతిలో కదలిక ఉండకపోవచ్చు.

శక్తి వినియోగం, కండరాల కదలికలు, ఏ ఆటలాడినా పిల్లలకు ఒకేలా అందుతాయి. అయితే ఈ ఆటల ద్వారానే పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగవుతుందనీ, వాళ్లు దేన్నైనా జ్ఞాపకం పెట్టుకోగలరని జార్జియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. పరుగులు తీయటంతో గుండెకొట్టుకొనే వేగం మెరుగవుతుంది. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా బావుంటుంది. మెదడు వికసించేందుకు అవసరమైన హార్మోన్‌లు విడుదల అవుతాయి. మెదడు కణాల ఆరోగ్యానికి వ్యాయామం, ఆటలు రెండూ అవసరం. ఇప్పుడు కొత్త పరిశోధనలు ఏం చెబుతాయంటే పిల్లలను ప్రకృతికి దగ్గరగా ఉంచమని, వాళ్లకు చెప్పే విద్యాబోధన ఆటలతో కలిసి, చాలా ఇష్టంగా వాళ్ల మెదడుకు అందాలని చెబుతున్నాయి.

పిల్లలకు పెద్దవాళ్లకు మల్లే టార్గెట్స్, ఇంజనీరింగ్ చదువు, కోట్ల రూపాయల చదువు ఏవీ ఉండవు. వాళ్లు ఆడుకోవటంతో ఆనం దం పొందుతారు. విజ్ఞులు ఈ పిల్లల్లో ఉండే ఈ ఆకర్షణను చదువుకు దగ్గరగా మళ్లించమంటారు. వాళ్లకు ఆటపాటలు ఇష్టం కనుక ఆ ఆట ల్లో చదువును వాళ్లకు తెలియకుండా కలిపేయమంటారు.

మనదేశంలో జరిపిన ఒక పరిశోధనల ప్రకారం ఆటలు ఆడటం ద్వారా పిల్లలు ఒక అంశం పైన దృష్టి పెట్టగలుగుతారని, ఒక పని చేయటంలో నేర్పు వస్తుందనీ, భావోద్వేగాల అదుపుతో మనసుకు ప్రశాంతత వస్తుందని తేలింది. ఎండార్ఫియన్‌లు విడుదలై మనసుకి హాయి కలుగుతుంది. మనదేశంలో అనాదిగా పాటించిన జీవిత విధానమే సరైనదని నేడు విదేశీ విశ్వవిద్యాలయ పరిశోధనలు అంగీకరిస్తున్నాయి.

వేకువ జామున లేవటం, ఆ సమయంలో వీచే స్వచ్ఛమైన గాలి, చిన్న ఆటలతో ఆ రోజంతా హుషారుగా, చురుకుదనంతో వ్యవహరిస్తారని సూచిస్తున్నారు. ఆటలు ఆడితే చదువుకు సమయం దొరక్క వెనకబడతారని అనుకుంటారు. కానీ ఆటలతో చదువులో మరింత చురుగ్గా ఉంటారంటున్నాయి అధ్యయనాలు. పిల్లల్లో కూడా ఒత్తిడి ఉంటుంది. చిన్న పిల్లలు అప్పటి వరకు తల్లిదండ్రులు, ఇంటికే పరిమితం అయినవాళ్లు. స్కూలు, టీచర్లు, కొత్త వాతావరణం, చుట్టూ పిల్లలు, ఆటలాడితే కార్డినల్ స్థాయి కనిష్ట స్థాయిలో ఉన్నట్లు పిల్లలపైన ఫిన్‌లాండ్ దేశంలో జరిపిన ఒక పరిశోధనలో తేలింది. ఆటల్లో పిల్లలు మాట్లాడుకుంటారు. వాళ్ల మూడ్ మారిపోతుంది. ఆనందం ఆత్మస్థైర్యం వస్తుంది.. ఇది హార్వర్డ్ మెడికల్ స్కూలు వాళ్లు గడిచిన 35 సంవత్సరాలుగా సాగించిన పరిశోధన ఫలితాలు. ఈ ఆటలు ఆడటం వల్ల పిల్లల్లో ఒక అంశంపైన దృష్టి కేంద్రీకరించే శక్తి పెరుగుతుంది. ఆటలు ఆడే పిల్లల్లో మిగతా అన్ని విభాగాల్లో మించిన చరుకుదనం లెక్కల్లో కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

స్కూలు విద్యాబోధన అంశం పక్కనపెట్టి, కనీసం తల్లిదండ్రులు ఆటల పట్ల కాస్త శ్రద్ధ తీసుకోమంటున్నారు ఎక్స్‌పర్ట్. వాళ్ల చదువును ఆటపాటలతో ముడిపెడితే బాగా వస్తుందని తెలుసుకోవాలి. సెలవుల్లో పిల్లలకు స్కూలు చదువు, ప్రాముఖ్యత, వారి భవిష్యత్తును, పాఠాలు చెప్పినట్లు కాకుండా, వాళ్లతో ఆడుతూ ఆడిస్తూ తెలియజెప్పండి. చదువు పట్ల ఆసక్తిపెంచేలాగా వాళ్ల దృష్టి మళ్లించండి. చదువు అంటే అదేదో కఠినమైన దండన లాగా కాకుండా, వాళ్లు స్కూల్లో, ఇతర పిల్లలతో కలిసి, చదువును సంతోషంగా ఇష్టంగా నేర్చుకోవాలని తెలిసేలా చిన్న కథలు, ఆటల ద్వారా తెలియజెప్పండి.

నిజంగానే స్కూలు చదువు వాళ్ల భద్రమైన భవిష్యత్తు కోసం మాత్రమే. వాళ్లకు జ్ఞానం ఇచ్చి, చక్కని పౌరులుగా తీర్చిదిద్దే చదువు గొప్పతనాన్ని పిల్లలకు అర్థమయ్యేలాగా నేర్పితే, ఇంక వాళ్లెప్పుడూ స్కూలును దండన కింద భావించరు. చదువును భారం అనుకోరు. కానీ ఆ విలువ వాళ్లకు ఆటపాటల ద్వారా చెబుతున్నట్లు తెలియకుండానే నేర్పించండి. వాళ్ల జీవిత విధానంలో అప్పుడు చదువు ఒక భాగం అవుతోంది. ఐక్యూ తేడాలతో మార్కులు సాధించటంలో కాస్త అటు ఇటుగా ఉన్నా, ముందు చదువు అవసరం మాత్రం వాళ్లకు బోధపడుతుంది. వాళ్లు చదువుకోవటం మొదలు పెడతారు. చక్కని విద్యార్థులు అవుతారు.
రవిచంద్ర. సి

Games are Foundation for Education

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆటలతో చదువుకు పునాది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.