అంచనాలు తారుమారు…

  కోహ్లి సేనపై తగ్గని అభిమానుల ఆగ్రహం క్రీడా విభాగం: ప్రపంచకప్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగిన టీమిండియా సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టడం కోట్లాది మంది అభిమానులకు మింగుడు పడడం లేదు. 2015 ప్రపంచకప్‌తో పోల్చితే ఈసారి భారత్‌కు ట్రోఫీ సాధించే అవకాశాలు చాలా మెరుగ్గా కనిపించాయి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, బుమ్రా, భువనేశ్వర్, షమి తదితరులతో టీమిండియా ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగింది. అంచనాలకు తగినట్టుగానే […] The post అంచనాలు తారుమారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కోహ్లి సేనపై తగ్గని అభిమానుల ఆగ్రహం

క్రీడా విభాగం: ప్రపంచకప్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగిన టీమిండియా సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టడం కోట్లాది మంది అభిమానులకు మింగుడు పడడం లేదు. 2015 ప్రపంచకప్‌తో పోల్చితే ఈసారి భారత్‌కు ట్రోఫీ సాధించే అవకాశాలు చాలా మెరుగ్గా కనిపించాయి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, బుమ్రా, భువనేశ్వర్, షమి తదితరులతో టీమిండియా ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగింది. అంచనాలకు తగినట్టుగానే లీగ్ దశలో కోహ్లి సేన వరుస విజయాలతో అదరగొట్టింది.

శిఖర్ ధావన్ గాయంతో మధ్యలోనే వైదొలిగినా మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ నిలకడగా ఆడుతూ ఆ లోటు లేకుండా చేశాడు. ఇక, లీగ్ దశలో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. వరుస సెంచరీలతో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. కోహ్లి కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రాహుల్ కూడా మెరుగైన ప్రదర్శన కనబరచడంతో భారత్‌కు ఎదురులేకుండా పోయింది. సెమీఫైనల్‌కు చేరుకునే క్రమంలో రోహిత్ బ్యాటింగ్ అసాధారణ రీతిలో సాగి పోయింది. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడాడు. ప్రపంచకప్‌లోనే అత్యంత అరుదైన రికార్డును రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు.

రోహిత్ ఐదు శతకాలతో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. రోహిత్‌తో పాటు రాహుల్ కూడా నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఇలా ఓపెనర్లు శుభారంభం అందించడంతో లీగ్ దశలో భారత్ ఏడు విజయాలను సాధించింది. ఒక్క ఇంగ్లండ్ చేతిలోనే ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక వంటి బలమైన జట్లను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. అయితే సెమీస్‌లో మాత్రం పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్ కూడా లీగ్ దశ ఆరంభంలో అసాధారణంగా రాణించింది. పెద్ద పెద్ద జట్లను సైతం అలవోకగా ఓడిస్తూ పెను ప్రకంపనలే సృష్టించింది.

అయితే కీలక సమయంలో వరుస ఓటములతో సెమీస్‌కు చేరడమే కష్టంగా మార్చుకుంది. పాకిస్థాన్‌తో సమానంగా నిలిచినా మెరుగైన రన్‌రేట్‌తో గట్టెక్కింది. ఇలాంటి జట్టుతో సెమీస్ పోరు అనగానే భారత అభిమానుల అంచనాలకు హద్దు లేకుండా పోయింది. కివీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించడం ఖాయమని ఊహల్లో తేలిపోయారు. ఇక, మీడియాలో కూడా టీమిండియాను ఆకాశానికి ఎత్తేశారు. తీరా మ్యాచ్ ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా వచ్చింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లి సేన స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఇంటిదారి పట్టింది.

లీగ్ దశలో అసాధారణంగా రాణించిన టాప్ ఆర్డర్ సెమీస్ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా చతికిల పడిపోయింది. రాహుల్, రోహిత్, కోహ్లిలు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో భారత్ మళ్లీ కోలుకోలేక పోయింది. ఆఖర్లో ధోని, జడేజాలు పోరాటం చేసినా అప్పటికే పరిస్థితి చేజారి పోయింది. ప్రారంభ ఓవర్లలో స్కోరు నత్తనడకన సాగడంతో చివరికి వచ్చే సరికి రన్‌రేట్ ఒక్కసారిగా పెరిగి పోయింది. ఈ క్రమంలో వేగంగా ఆడేందుకు ప్రయత్నించి జడేజా వికెట్ పారేసుకున్నాడు. ధోని కూడా ఇలాంటి పరిస్థితిలోనే రనౌటయ్యాడు. దీంతో భారత్ ఓటమి పాలుకాక తప్పలేదు.

విమర్శల వెల్లువ
టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటు అభిమానులు, అటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు భారత జట్టు ఓటమిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చెత్త ఆటతో చేజేతులా ఓటమి పాలయ్యారని విమర్శిస్తున్నారు. కోహ్లి తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు. కీలక మ్యాచ్‌లో షమిని పక్కన పెట్టడం, చాహల్‌పై భారీ నమ్మకం పెట్టుకోవడం, ధోనిని బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి పంపించడం వంటి కారణాలతో జట్టు ఓటమి పాలుకాక తప్పలేదని వాపోతున్నారు. రిషబ్ పంత్, కార్తీక్, హార్దిక్ తదితరులు కాస్త సమన్వయాన్ని పాటించి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరోలా ఉండేదని, అంతేగాక చాహల్ ఒకే ఓవర్‌లో భారీగా పరుగులు సమర్పించుకోవడం కూడా జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని వారు అభిప్రాయపడుతున్నారు.

Furious outrage over Kohli Sena

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అంచనాలు తారుమారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: