మలేరియా దోమలను నాశనం చేసే ఫంగస్ విషం

mosquitoesలండన్ : జన్యు పరంగా మార్పు చెందిన ఫంగస్ మలేరియా వ్యాధి కారక దోమలను నాశనం చేయడం వ్యాధిపై సాగు తున్న పోరాటంలో ఒక మలుపుగా పరిశోధకులు భావిస్తున్నారు. బర్కినాఫాసోలో ఈమేరకు జరిగిన ప్రయోగాల్లో జన్యుపరంగా మార్పు చెందిన ఫంగస్ విషాన్ని ఉత్పత్తి చేస్తుందని ఫలితంగా వేగంగా మలేరియా కారక దోమ లను ఎక్కువ శాతం నాశనం చేస్తుందని పరి శోధకులు తెలిపారు. 45రోజుల్లో దోమల సంతతి 90శాతం వరకు నాశనమవు తుందని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, బర్కి నోఫా సోలోని ఐఆర్‌ఎస్‌ఎస్ రీసెర్చి ఇనిస్టి ట్యూట్ పరిశోధకులు వెల్లడించారు.

మెటారీ జియమ్ పింగ్‌షాయెన్స్ అనే ఫం గస్‌ను పరి శోధకులు ఎంపిక చేశారు. ఈ ఫంగస్ మలే రియా దోమలను సహజంగా ప్రభా వితం చేస్తుంది. జన్యుపరంగా దీన్ని మార్పు చేయ డంతో ఇది విషపూరిత సాలీడుల్లో ఉం డే విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రయోగశాలల్లో పరీక్షలు చేయగా జన్యుమార్పిడి ఫంగస్ వేగంగా ఆయా దోమలను నాశనం చేస్తుం దని తేలింది. నిజమైన గ్రామం వంటి నమా నా గ్రామాన్ని 6500 చదరపు అడుగుల్లో రూపొందించి దోమలను పరిశోధకులు విడి చిపెట్టారు.

అవి తమ సంతానోత్పత్తిని అక్కడ పూర్తి చేసేలా చూశారు. టెంట్ కంపార్టు మెంట్లలో ఉండే దోమలు ఫంగస్ ప్రభావా నికి గురై చనిపోయాయి. దీంతో మలేరియా నిర్మూలనకు వీలవుతుందన్న ఆశ కలిగింది. ప్రస్తుతం ఈ పరిశోధన ప్రాథమిక దశలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మలేరియా నిర్మూలనకు ప్రయత్నాలు జరుగుతున్నా సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదు. దీనికి కావలసిన నిధులు అందకపోవడం, ప్రస్తుతం వాడుతున్న మందులను ప్రతిఘ టించే శక్తి మలేరియా వైరస్‌కు పెరగడం తదితర కారణాల వల్ల అనుకున్న ఫలితాలు చేకూ రడం లేదు.

Fungus is a poison that destroys malaria mosquitoes

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మలేరియా దోమలను నాశనం చేసే ఫంగస్ విషం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.