పోషకాలు నష్టపోకుండా…!

  మనం కూరగాయల్ని రకరకాల పద్ధతుల్లో తింటాం. ఉడకబెడతాం, ఆవిరి మీద ఉడికిస్తాం, వేయిస్తాం, కొన్నిటిని పచ్చిగా తినేస్తాం! అయితే కూరగాయల్లోని పోషకాలు ఒంటికి పూర్తిగా అందాలంటే ఇలా చేయండి.. నిజానికి కూరగాయల్లో పోషకాల నష్టం వాటి తత్వం, వండే పద్ధతుల మీదే ఆధారపడి ఉంటుంది. మొక్క నుంచి కోసిన క్షణం నుంచే కూరగాయల్లో పోషక నష్టం మొదలవుతుంది. ఆ తర్వాత ఆ మొక్క నుంచి పోషకాలు అందే వీలు లేకపోవటంతో కూరగాయలు వాటిలోని పోషకాలనే ఇంధనంగా […] The post పోషకాలు నష్టపోకుండా…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనం కూరగాయల్ని రకరకాల పద్ధతుల్లో తింటాం. ఉడకబెడతాం, ఆవిరి మీద ఉడికిస్తాం, వేయిస్తాం, కొన్నిటిని పచ్చిగా తినేస్తాం! అయితే కూరగాయల్లోని పోషకాలు ఒంటికి పూర్తిగా అందాలంటే ఇలా చేయండి..
నిజానికి కూరగాయల్లో పోషకాల నష్టం వాటి తత్వం, వండే పద్ధతుల మీదే ఆధారపడి ఉంటుంది. మొక్క నుంచి కోసిన క్షణం నుంచే కూరగాయల్లో పోషక నష్టం మొదలవుతుంది. ఆ తర్వాత ఆ మొక్క నుంచి పోషకాలు అందే వీలు లేకపోవటంతో కూరగాయలు వాటిలోని పోషకాలనే ఇంధనంగా వాడుకుంటూ ఉంటాయి. దాంతో పోషక నష్టం రోజులు గడిచేకొద్దీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మొక్క నుంచి కోసిన వెంటనే కూరగాయల్ని వాడుకోవాలి. మార్కెట్‌లో తాజాగా కనిపించే వాటినే ఎంచుకోవాలి.

సి విటమిన్‌కు నీటిలో కరిగే గుణం ఉంటుంది. అలాగే ఆక్సిజన్ కలిసిన వాతావరణంలో ఈ విటమిన్ నిలకడగా ఉండలేదు. కాబట్టి విటమిన్ సి ఉండే కూరగాయల్ని ఎక్కువ రోజులు నిల్వ చేస్తే విటమిన్ నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఉడికించే పద్ధతుల ద్వారా 15 నుంచి 55 శాతం విటమిన్ సి నష్టమవుతుంది. విటమిన్ సితోపాటు విటమిన్ బి, పాలీఫినాల్స్ అనే ఇతర పోషకాల నష్టం కూడా జరుగుతుంది.

అన్ని కూరగాయలూ ఒకే రకమైన తత్వాలను కలిగి ఉండవు. కొన్నిటిని ఉడికిస్తేనే వాటిలోని విటమిన్లు పెరుగుతాయి. ఉదాహరణకు క్యారెట్లను నీటిలో ఉడికించటం వల్ల వాటిలోని కెరోటినాయిడ్లు పెరుగుతాయి. అదే ఆవిరి మీద ఉడికిస్తే విటమిన్ సితోపాటు, కెరోటినాయిడ్లను నష్టపోతాం. అయితే స్టీమ్ చేయటం ద్వారా ఫినోలిక్ యాసిడ్ అనే యాంటి ఆక్సిడెంట్ పెరుగుతుంది.

Fresh Vegetables should be used

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పోషకాలు నష్టపోకుండా…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.