మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఉచిత శిక్షణ

Free Trainingరంగారెడ్డి : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాధ్య గ్రామీణ కౌశల్య యోజన (డిడియు-జికెవై)పథకంలో భాగంగా మైనార్టీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కలిపించనున్నారు. ఈ క్రమంలో  అపోలో మెడ్ స్కిల్స్ ఆధ్వర్యంలో గ్రామీణ  మైనార్టీ నిరుద్యోగ యువతకు ఆరోగ్య, సంరక్షణ రంగంలో వివిధ కోర్సుల్లో 4 నెలల పాటు  ఉచిత శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన వసతి కలిపించనున్నారు. శిక్షణ పూర్తయిన తరువాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రత్నకల్యాణి తెలిపారు.. శిక్షణ అనంతరం హెచ్‌ఎస్‌ఎస్సీ, అపోలో మెడ్ స్కిల్స్ సర్టిఫికేట్ పాటు ఉద్యోగ సమయంలో మొదటి మూడు నెలలకు గాను రూ.3000 (పిపిఎస్-పోస్టు ప్లేస్‌మెంట్ సపోర్టు) ఇవ్వడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.  ఆసక్తి గల వారు ఈనెల 31లోగా తమ దరఖాస్తులను డిఎండబ్ల్యూఒకు పంపిచాలని ఆమె సూచించారు.  పూర్తి వివరాల కోసం 79939329 21/ 7330924112 సంప్రదించాలని ఆమె కోరారు.

Free Training For Minority Unemployed Youth

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఉచిత శిక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.