గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందించాలి : వెంకయ్య

రంగారెడ్డి : గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.  శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ లో  స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌- కేర్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకయ్య మాట్లాడారు. ప్రస్తుత జీవన శైలికి శారీరక శ్రమ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆయన వైద్యులకు సూచించారు. ఫోన్లు, టివిలకు బానిసలు […] The post గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందించాలి : వెంకయ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.  శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ లో  స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌- కేర్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకయ్య మాట్లాడారు. ప్రస్తుత జీవన శైలికి శారీరక శ్రమ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆయన వైద్యులకు సూచించారు. ఫోన్లు, టివిలకు బానిసలు కావొద్దని, ఇటువంటి సంస్కృతికి దూరంగా ఉండాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఉత్సాహాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు.

Free Medical Camp in Muchintal Village

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందించాలి : వెంకయ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: