మాజీ ఎంపి కవిత ఔదార్యం…. అన్నదానానికి రెండేళ్లు

 

నిజామాబాద్ మాజీ ఎంపి కవిత చేస్తున్న అన్నదానం కార్యక్రమం రెండేళ్లు పూర్తిచేసుకుంది. నిజమాబాద్ పట్టణంలో కవిత ప్రారంభించి అన్నదానం కార్యక్రమం నిర్వీరామంగా కొనసాగుతోంది. 2017, నవంబర్ 8న కవిత పట్టణంలోని పెద్దాసుపత్రికి వచ్చినప్పడు ఇక్కడ రోగులకు ఆహారం లభించడం లేదనే విషయాన్ని గుర్తించి, వారి ఆకలి తీర్చేందుకు ఆసుపత్రి ప్రాంగణంలోనే అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ అన్నదాన కేంద్రంలో రోజూ సుమారు 800 నుంచి 900 మంది భోజనం చేస్తున్నారు. ఈ ఆసుపత్రికి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా రోగులు వస్తుంటారు. ఈ ఆస్పత్రితోపాటు జిల్లాలోని మరో పెద్దాసుపత్రి అయిన బోధన్ ప్రభుత్వ ఆస్పత్రి, ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నదానాన్ని ఆమె మొదలుపెట్టారు. ఈ రెండు ఆస్పత్రిల్లో దాదాపు 700 మంది భోజనం చేస్తున్నారు.

Free Meal Scheme Running by Kavitha in Nizamabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాజీ ఎంపి కవిత ఔదార్యం…. అన్నదానానికి రెండేళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.