చిన్నారిపై కామాంధుడి అత్యాచారం

rape

 

పోలీసుల అదుపులో నిందితుడు

పెద్దేముల్ రూరల్ : వరంగల్‌లో చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితునికి ఉరిశిక్ష వేసిన సంఘటన మరవకముందే వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో అటువంటి మరో ఘాతుకం జరిగింది. అంగన్‌వాడీలో చదువుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. మండల పరిధిలోని రేగొండి గ్రామానికి చెందిన నగేష్(20)గత శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వరసకు మేనకోడలు అయిన నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు.

అదే రోజు సాయంత్రం చిన్నారికి జ్వరం రావడంతో తల్లితండ్రులు చికిత్స నిమిత్తం తాండూరు జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అదే సమయంలో చిన్నారి తనపై జరిగిన సంఘటన గురించి తల్లితండ్రులకు చెప్పింది. అప్పటికే నగేష్ పరారీలో ఉన్నాడు. వెంటనే చిన్నారి తల్లి పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తాండూరు డిఎస్పి రామచంద్రుడు,సిఐ రవికుమార్ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. నిందితుడు నగేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పెద్దేముల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Four year old child raped

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిన్నారిపై కామాంధుడి అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.