ఉన్మాది దాడిలో నలుగురు మృతి

Knife Attackఅమెరికా : దక్షిణ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ ఉన్మాది కత్తితో స్థానికులపై దాడిచేశాడు. ఈ దాడిలో నలుగురు చనిపోయారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 4.23 గంటలకు నిందితుడు ఓ గార్డన్ గ్రోవ్ పట్టణంలోని ఉన్న ఓ బేకరిలో చోరీ చేశాడు. అనంతరం ఓ అపార్టమెంట్ వద్ద ఇద్దరిపై కత్తితో దాడి చేశారు. వీరిలో ఒకరు ఘటనాస్థలిలోనే చనిపోగా, మరొకరు ఆస్పత్రిలోచికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో నిందితుడు చెక్ -క్యాషింగ్ బిజినెస్ వద్ద చోరీ చేశాడు. అనంతరం పలువురిపై నిందితుడు పలువురిపై కత్తితో దాడి చేశాడు. ఇక్కడ కూడా ఇద్దరు మృతి చెందారు. అనంతరం అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డను కత్తితో పొడిచి, అతడి తుపాకీని లాక్కొని పరారయ్యాడు. దీంతో కారులో వెళుతున్న నిందితుడిని వెంబడించి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Four People Dead In Psycho Attack At America

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉన్మాది దాడిలో నలుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.