బాలుడిని ఢీకొట్టిన కారు…

Road-Accidentకరీంనగర్: జిల్లాలోని గన్నేరువరం మండలం గుండ్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి సుబు ఖాన్ అనే కుర్రాడిని ఢీకొట్టి, కిరాణా షాప్ పైకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా.. అందులో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులతో పాటు, రెండు కాళ్లు విరిగిపోయిన బాలుడిని సమీప దవాఖానకు తరలించారు. అయితే, అధికారులు ఇప్పటికే గుండ్లపల్లి క్రాస్ రోడ్డును అధికారులు యాక్సిడెంట్ జోన్ గా ప్రకటించారు. కానీ తరుచూ ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

Accident

Four Injured in Road Accident At Karimnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాలుడిని ఢీకొట్టిన కారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.