నలుగురు నకిలీ విలేకరులు అరెస్టు

arrested

కరీంనగర్ : వారి వద్ద నుంచి ఒక కారుతో పాటు నకిలీ మీడియా ఐడి కార్డులు, గంజాయి, సెల్‌ఫోన్‌లు, ఎటిఎం కార్డులు, ట్యాబ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి వివరాలను తెలిపారు. ఉత్తారాఖండ్‌లోని ఉదయ్‌సింగ్‌నగర్, రుద్రాపూర్‌కు చెందిన సౌరబ్‌గబా, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ఆమెథీ పరిధిలో గల మోతీతలాబ్‌కు చెందిన రాంసంజీవన్‌మౌర్యా, హర్యానాలోని ఫరీదాబాద్, బల్లభగర్ సమీపంలోని ఆదర్శ్‌నగర్‌కు చెందిన మధువర్మ, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, కేషల్‌గంజ్ సమీపంలోని ఖాన్‌పూర్‌కు చెందిన హరిదీప్‌సింగ్‌లు కలిసి డబ్బు సులభంగా సంపాదించేందుకు ఒక ముఠాగా ఏర్పడ్డారు.

తాము విలేకరులము అని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడి డబ్బు దండుకునేందుకు 15 రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. అయితే హైదరాబాద్‌ లో వీరి చర్యలకు ఏవరూ భయపడకపోవడంతో గూగూల్ సహాయంతో కరీంనగర్‌లో అత్యధికంగా ఆసుపత్రులు ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం బెదిరింపులకు పాల్పడి డబ్బులు దండుకోవచ్చనే ఆలోచనతో ఈనెల 7వ తేదీన కరీంనగర్‌కు వచ్చారు. ఓ మహిళకు అబార్షన్ చేయాలని వారు ఒప్పుకుంటే స్ట్రింగ్ అపరేషన్ పేరుతో వారిని బెదిరించి డబ్బులు దండుకోవాలని వారి ఆలోచన చేశారు. పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా కారులో వస్తున్న వీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా 2 కిలోల గంజాయి లభ్యమైంది.

దీంతో వారిని అదుపులోనికి తీసుకుని లోతుగా విచారించగా నకిలీ విలేకరులనే విషయం వెలుగులోనికి వచ్చిందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు. వీరి వద్ద నుండి పోర్డ్ కారు, 8 సెల్‌ఫోన్‌లు, ట్యాబ్, నకిలీ ప్రెగ్నెన్సీ ల్యాబ్ రిపోర్ట్, రూ.4వేల నగదు, నకిలీ మీడియా ఐడి కార్డులు, 2 కిలోల గంజయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ అడిషనల్ డి.సి.పి (లా అండ్ ఆర్డర్) ఎస్.శ్రీనివాస్, కరీంనగర్ రూరల్ సిఐ తులా శ్రీనివాస్‌రావు, కరీంనగర్ కమీషనరేట్ టాస్క్‌ఫోర్స్ సిఐ శశిధర్‌రెడ్డి, ఎస్.ఐ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
four fake reporters arrested in karimnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నలుగురు నకిలీ విలేకరులు అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.