మావోయిస్టుల పేరుతో వసూళ్లు

  నలుగురు నకిలీ నక్సల్స్ అరెస్ట్,  రూ.లక్ష 65వేల నగదు, బొమ్మ తుపాకీ, 16 సెల్‌ఫోన్లు స్వాధీనం వరంగల్ : మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు నకిలీ నక్సల్స్‌ను సోమవారం కెయుసి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల నుండి సుమారు రూ.లక్ష 65 వేల నగదుతో పాటు బొమ్మ తుపాకీ, 16 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, కత్తిపెన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి సిపి రవీందర్ తెలిపిన […] The post మావోయిస్టుల పేరుతో వసూళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నలుగురు నకిలీ నక్సల్స్ అరెస్ట్,  రూ.లక్ష 65వేల నగదు, బొమ్మ తుపాకీ, 16 సెల్‌ఫోన్లు స్వాధీనం

వరంగల్ : మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు నకిలీ నక్సల్స్‌ను సోమవారం కెయుసి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల నుండి సుమారు రూ.లక్ష 65 వేల నగదుతో పాటు బొమ్మ తుపాకీ, 16 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, కత్తిపెన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి సిపి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌కు చెందిన పూసల శ్రీమన్నారాయణ, వరంగల్ రూరల్ జిల్లా కామారెడ్డి మండలంలోని పరకాల గ్రామానికి చెందిన పోతరాజు అశోక్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలానికి చెందిన నర్మెట్ట నాగరాజు(ప్రస్తుత నివాసం ఎల్‌బినగర్ వరంగల్ అర్బన్ జిల్లా), జనగాం జిలా ్ల కొడకండ్ల మండలం చెరువుముందు గ్రామం తండాకు చెందిన ధరావత్ శ్రీనివాస్ మావోయిస్టుల ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఈ నలుగురు మరికొద్ది మంది వ్యాపారస్తులను బెదిరించేందుకుగాను కెయుసి అతిథిగృహం వద్ద సమావేశమైనారని టాస్క్‌ఫోర్స్ ఎసిపి చక్రవర్తికి సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ దేవేందర్, కెయుసి ఇన్స్‌పెక్టర్ డేవిడ్‌రాజు తన సిబ్బందితో కలిసి దాడి చేయగా నిందితులు పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని వెంబడించి పట్టుకొని విచారించడంతో నిందితులు తాము పాల్పడిన నేరాలను పోలీసుల ఎదుట అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ ఎసిపి చక్రవర్తి, హన్మకొండ ఎసిపి శ్రీధర్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ దేవేందర్‌రెడ్డి, కెయుసి ఇన్స్‌పెక్టర్‌డేవిడ్‌రాజు, సైబర్ క్రైం ఇన్స్‌పెక్టర్ విశ్వేశ్వర, టాస్క్‌ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్ శ్యాంసుందర్, శ్రీకాంత్‌రెడ్డి, ఎను, అలీ, రాజులను సిపి రవీందర్ అభినందించారు.

Four fake Naxals arrested

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మావోయిస్టుల పేరుతో వసూళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: