రాబర్ట్ ముగాబే

              జింబాబ్వే (ఒకప్పటి రొడీషియా) స్వాతంత్య్ర సమర సారథి, వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే మరణంతో ఆయన ప్రాభవ, పతనాలతో కూడిన ఒక సుదీర్ఘ అధ్యయానికి తెర పడింది. ముగాబే తన 95వ ఏట సింగపూర్‌లో చికిత్స పొందుతూ అంతిమ శ్వాస విడిచారు. దాదాపు ఒక శతాబ్ది కాలపు శ్వేత జాతీయుల నిరంకుశ పాలనపై మొక్కవోని పోరాటం నడిపి విజయ గమ్యం చేర్చిన ముగాబే అధికారం చేపట్టిన […] The post రాబర్ట్ ముగాబే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

              జింబాబ్వే (ఒకప్పటి రొడీషియా) స్వాతంత్య్ర సమర సారథి, వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే మరణంతో ఆయన ప్రాభవ, పతనాలతో కూడిన ఒక సుదీర్ఘ అధ్యయానికి తెర పడింది. ముగాబే తన 95వ ఏట సింగపూర్‌లో చికిత్స పొందుతూ అంతిమ శ్వాస విడిచారు. దాదాపు ఒక శతాబ్ది కాలపు శ్వేత జాతీయుల నిరంకుశ పాలనపై మొక్కవోని పోరాటం నడిపి విజయ గమ్యం చేర్చిన ముగాబే అధికారం చేపట్టిన తర్వాత తెల్లవారికి, ఆఫ్రికన్లకు మధ్య సర్దుబాటు సామరస్యాల కోసం పాటుపడిన నాయకుడుగా పేరొందారు. ఉన్నత విద్యావంతుడైన ముగాబే 1980 నుంచి 87 వరకు ప్రధానిగా ఆ తర్వాత 2017 వరకు దేశాధ్యక్షుడుగా ఉన్నారు.

ప్రజల ఆదరాభిమానాలు విశేషంగా చూరగొని అధికారంలోకి వచ్చిన ముగాబే చరమాంకంలో వారి ఆగ్రహాన్ని చవిచూశారు. సొంత సైనికాధికారుల సహాయ నిరాకరణ, తిరుగుబాటు కారణంగా గృహ నిర్బంధానికి గురయి బలవంతంగా అధికారం నుంచి నిష్క్రమించవలసి వచ్చింది. ప్రజల ప్రగాఢ విశ్వాసం చూరగొని జన నేత కావడం ఎలాగో, వారిలో అసంతృప్తికి, ఆగ్రహానికి దోహదపడి వారికి ఎలా దూరం కాకూడదో తెలుసుకోడానికి ముగాబే జీవితం ఒక పాఠంగా నిలిచిపోతుంది. 1975 నుంచి దేశ స్వాతంత్య్రం సిద్ధించిన 1980 వరకు ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ గ్రూపు అధ్యక్షుడుగా ఉన్న ఆయన అది రాజకీయ పార్టీగా మారిన తర్వాత 1980 నుంచి 2017 వరకు దానికి సారథ్యం వహించారు.

బతికున్న ఏ ఒక్క శ్వేత జాతీయుడిని నమ్మరాదని, తెల్లవాడే అసలైన శత్రువని, వాడి గుండెల్లో భయం పుట్టించడమే లక్షంగా పని చేయాలని తన పార్టీకి ఉద్బోధించి తన ప్రజలను పోరాట బాటలోకి నడిపించిన ముగాబే ఉక్కు సంకల్పం సాటిలేనిది. “రూపు కట్టిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ముగాబే, ఆఫ్రియన్ ప్రజల విముక్తి, సాధికారత సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన యావత్ ఆఫ్రికా ప్రియతమ నేత ఆయన, మన జాతి, మన ఖండం చరిత్రకు ఆయన చేసిన త్యాగాల సంపద ఎన్నటికీ మరువలేనిది” అని ఆయన వారసుడు ప్రస్తుత జింబాబ్వే అధ్యక్షుడు ఎమెర్సన్ మంగాగ్వా ముగాబే మరణ వార్తను వెల్లడిస్తూ చేసిన ప్రశంస ఆయన గొప్పతనాన్ని చాటుతున్నది. ముగాబే జీవితాంతం దేశ ఆధిపత్యంలో తానే కొనసాగుతానని గాఢమైన ఆత్మవిశ్వాసం పెంచుకొన్న ముగాబే ఆచరణలో ఘోరంగా విఫలమయ్యారు.

మార్కిజం, లెనినిజం, మావోయిజంలు తనకు ఆదర్శమని చెప్పుకొన్న ముగాబే సాటిలేని, అనితరమైన అధికార దాహాన్ని చాటుకున్నారు. అధికారచ్యుతుడు కావడానికి ముందు 2017 ఫిబ్రవరిలో ఇచ్చిన ఒక ఇంటర్వూలో తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలుపొందుతానని ప్రకటించారు. పార్టీ మొత్తం మళ్లీ తన నాయకత్వాన్నే కోరుకుంటున్నదన్నారు. తనకు సాటిలేరని చెప్పుకొన్నారు. దేశ ప్రజలు ఇతర నాయకులందరినీ తనతో పోల్చుకొని తనంత ఎత్తున గలవారు ఇంకొకరు లేరని నిర్ధారణకు వచ్చినట్టు వివరించారు. అయితే 2017 నవంబర్‌లోనే ఉన్నత సైన్యాధికారులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. పార్టీ ముగాబేను నాయకత్వ పీఠం నుంచి తొలగించింది. ముగాబే తన రెండవ భార్య గ్రేస్ ముగాబేను తన వారస పాలకురాలుగా చేయాలనుకుంటున్నారని వారు గట్టిగా భావించారు.

అందుచేతనే ఆయనకు ఎదురు చూడని నిష్క్రమణ మార్గాన్ని చూపించారు. గ్రేస్ ముగాబే డబ్బు, నగల పిచ్చి బాగా ముదిరిన వ్యక్తిగా అప్రతిష్ఠ పాలై ఉన్నారు. ముగాబే మొదటి భార్య శాలీ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె బతికి ఉంటే ముగాబేను మంచి మార్గంలో నడిపించి ఉండేవారని ప్రజలు అనుకునేవారు. కాని 1992లోనే ఆమె మరణించారు. ముగాబే పాలనలో తాము ఆశించిన భూ సంస్కరణల అమలు జాప్యం అవుతుండడంతో ఆఫ్రికన్లు తెల్లవారి భారీ వ్యవసాయ క్షేత్రాలను ఆక్రమించుకున్నారు.

దానితో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వ్యవసాయం దెబ్బతిని అపూర్వ సంక్షోభం అలముకున్నది. అంతవరకు సంపన్న స్థితిలో ఉన్న జింబాబ్వే వ్యవసాయం ద్వారా వస్తూ వచ్చిన విదేశీ మారక రాబడికి నష్టం వాటిల్లడంతో ఉన్నపళంగా పేదరికంలోకి కూరుకుపోయింది. ద్రవ్యోల్బణం ఊహించని స్థాయికి పెరిగిపోయింది. ముగాబే పదవీచ్యుతి సైనిక కుట్ర మాదిరి నేపథ్యంలో సంభవించినప్పటికీ ఆయన దేశం విడిచి పారిపోయే పరిస్థితిని తదుపరి పాలకులు సృష్టించలేదు. హరారేలోని అత్యంత వైభవోపేతమైన స్వగృహంలో కొనసాగనిచ్చారు. ముగాబే గొప్ప కామ్రేడని జింబాబ్వే జాతిపితలుగా గౌరవించవలసిన వారిలో ఒకరని ప్రస్తుత పాలకులు కీర్తించడమే ఆయన ఘనతకు నిదర్శనం.

Former Zimbabwe President Robert Mugabe dead

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాబర్ట్ ముగాబే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: