కెసిఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా…

హైదరాబాద్ : గత నాలుగేళ్ల కాలంలో కెసిఆర్ సారధ్యంలో రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందని మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి అన్నారు. కెసిఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సురేశ్ రెడ్డి చెప్పారు. బుధవారం కేశవరావు, కవిత, కెటిఆర్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలోమాజీ స్పీకర్ టిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడారు. 1989 నుంచి కెసిఆర్ తనకు స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఉద్యమాలు, త్యాగాలతో తెలంగాణ వచ్చిందని గుర్తు […]

హైదరాబాద్ : గత నాలుగేళ్ల కాలంలో కెసిఆర్ సారధ్యంలో రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందని మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి అన్నారు. కెసిఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సురేశ్ రెడ్డి చెప్పారు. బుధవారం కేశవరావు, కవిత, కెటిఆర్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలోమాజీ స్పీకర్ టిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడారు. 1989 నుంచి కెసిఆర్ తనకు స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఉద్యమాలు, త్యాగాలతో తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరానికి సాగునీరు అందించడానికి టిఆర్ఎస్ కృషి చేస్తుందని చెప్పారు. ఐటి రంగంలో హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలిచిందన్నారు. కెటిఆర్ పనితీరుతో తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని ఆయన పేర్కొన్నారు. సురేశ్ రెడ్డితో పాటు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ బండారి లక్ష్మారెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంఎల్ఎ కోడూరి సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, ముఖ్యనేతలకు గులాబీ కండువా కప్పి టిఆర్‌ఎస్ ముఖ్యనేతలు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

Comments

comments

Related Stories: