‘జాతీయ హోదా’ ఇవ్వకుంటే బిజెపికి పుట్టగతులుండవు

పాదయాత్ర, బస్సుయాత్ర కాదు.. కాంగ్రెస్ కాళేశ్వరం యాత్ర చేపట్టాలి కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత సృష్టి అతి త్వరలో బాహుబలి మోటార్ల ద్వారా పంపింగ్ వరద కాల్వలు ఏడాది పాటు నిండుకుండల్లా ఉంటాయి మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ మన తెలంగాణ/కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టు వెంటనే జాతీయ హోదా కల్పించాలని, లేదంటే బిజెపికి పుట్టగతులు ఉండవని మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో గల కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీ అండర్ […] The post ‘జాతీయ హోదా’ ఇవ్వకుంటే బిజెపికి పుట్టగతులుండవు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పాదయాత్ర, బస్సుయాత్ర కాదు..
కాంగ్రెస్ కాళేశ్వరం యాత్ర చేపట్టాలి
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత సృష్టి
అతి త్వరలో బాహుబలి మోటార్ల ద్వారా పంపింగ్
వరద కాల్వలు ఏడాది పాటు నిండుకుండల్లా ఉంటాయి
మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్

మన తెలంగాణ/కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టు వెంటనే జాతీయ హోదా కల్పించాలని, లేదంటే బిజెపికి పుట్టగతులు ఉండవని మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో గల కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీ అండర్ టన్నెల్‌ను శుక్రవారం మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించారు. 8వ ప్యాకేజీకి సందర్శనకు వచ్చిన ఎంపి మొదటగా సొరంగ మార్గం నుండి సర్జికల్ ఫూల్‌కు, అక్కడ నుండి బాహుబలి మోటార్ల వద్దకు వెళ్లారు. డిఇ నూనె శ్రీధర్ బాహుబలి మోటార్లు ఏవిధంగా పనిచేస్తాయో వారికి వివరించారు. అక్కడ నుండి కంట్రోల్ రూంకు, అక్కడ నుండి మోటార్ల అడుగు భాగానికి వెళ్లి అవి ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకున్నారు. సొరంగ మార్గం నుండి బయటకు వచ్చి డెలివరీ సిస్టంను పరిశీలించారు. అనంతరం గ్రావిటీ కెనాల్ వరద కాల్వకు నిర్మించిన కాలువ గేట్లను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని, దీని ద్వారా మిడ్‌మానేరుకు, ఎల్‌ఎండికి నీళ్లు వస్తాయని అన్నారు. వరద కాలువలో మూడు వందల అరవై అయిదు రోజులూ నీరు నిండుకుండలా ఉంటుందని చెప్పారు.

కేసీఆర్ శాసనసభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామంటే బిజెపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాలేదన్నారు. చేవెళ్ల రీడిజైన్ చేయడానికి ఇంతవరకూ ప్రాణహిత నది నుండి నేరుగా ఎల్లంపల్లికి నీరు విడుదల కాలేదని 2004-2014 వరకు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేదని అన్నారు. కాళేశ్వరం జాతీయ హోదా కోసం ఎన్నోసార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించామని, అయినా కానీ కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు దేవస్థానాలకు వెళ్లే బదులు కాళేశ్వరానికి బస్సు యాత్రతో వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలని అన్నారు. బిజెపి నాయకులు బండారి దత్తాత్రేయ కాళేశ్వరానికి పది వేల కోట్లు కేంద్ర సాయం చేసిందని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. అతి త్వరలోనే బాహుబలి మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయడం జరుగుతుందని, ఇది ఒక అద్భుత సృష్టి అని అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కల నెరవేరబోతుందని రైతుల కళ్లలో ఆనందం చూడటమే టిఆర్‌ఎస్ పార్టీ లక్షమని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు.

చొప్పదండి నియోజకవర్గంలో మొట్టమొదటగా నీళ్లు రావడం అదృష్టమని చొప్పదండి నియోజకవర్గం ఒక కోనసీమగా మారబోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ జడ్పీ ఛైర్మన్ తుల ఉమ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ వీర్ల వెంకటేశ్వర్‌రావు, ఈద శంకర్‌రెడ్డి, కోడూరి సత్యనారాయణ గౌడ్, జడ్పీటీసీ మార్కొండ లక్ష్మీ క్రిష్ణారెడ్డి, రామడుగు ఎంపిపి కలిగేటి కవిత లక్ష్మణ్, ఇంజనీర్లు రమేష్, సురేష్, వెంకటేశ్, మెగా కంపెనీ అధికారులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Former MP Vinod Kumar Demond National status to Kaleshwaram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘జాతీయ హోదా’ ఇవ్వకుంటే బిజెపికి పుట్టగతులుండవు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: