మాజీ ఎంపి మానిక్ రెడ్డి ఇకలేరు

Manik-Reddy

సంగారెడ్డి: మెదక్ మాజీ ఎంపి మానిక్‌రెడ్డి(80) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం స్వగ్రామం ఆందోల్ డాకూర్ లో అంత్యకియలు జరుగుతాయి. మానిక్‌రెడ్డి 1983లో  మెదక్ లోక్ సభ స్థానంలో టిడిపి నుంచి ఎంపిగా గెలిచారు. ఆయనకు బార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మానిక్‌రెడ్డి మృతిపట్ల సిఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.