నేల రాలుతున్న జాతీయ పక్షులు

కేసులపై సందిగ్ధంలో అటవీ అధికారులు ఇప్పటికి 30కి పైగా మృతి  మన తెలంగాణ /మహబూబ్ నగర్  : కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా అటవీ శాఖ అధికారుల పరిస్థితి తయారైంది. నెమళ్లు నేల రాలుతున్న వరుస ఘటనలతో రైతులపై కేసులు చేయడంపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. దీనికి కారణం నెమలి జాతీయ పక్షి కావడమే. ఒకప్పడు నెమళ్లను విరివిగా వేటాడి విందులు చేసుకునే వారు. నెమలి మాంసం […]

కేసులపై సందిగ్ధంలో అటవీ అధికారులు
ఇప్పటికి 30కి పైగా మృతి 

మన తెలంగాణ /మహబూబ్ నగర్  : కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా అటవీ శాఖ అధికారుల పరిస్థితి తయారైంది. నెమళ్లు నేల రాలుతున్న వరుస ఘటనలతో రైతులపై కేసులు చేయడంపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. దీనికి కారణం నెమలి జాతీయ పక్షి కావడమే. ఒకప్పడు నెమళ్లను విరివిగా వేటాడి విందులు చేసుకునే వారు. నెమలి మాంసం తింటే శరీరానికి మంచిదని అపోహతో వాటిని వేటగాళ్లు వేటాడి అమ్ముకోవడంతో ప్రభుత్వాలు నిషేదం విధించాయి.ఈ నేపథ్యంలో అంతరించే దశలో ఉన్న  నెమలిని కాపాడుకునేందుకు ప్రభు త్వం జాతీయ పక్షిగా ప్రకటించింది.ఈ చట్టం ప్రకారం నెమలిని వేటాడంకాని, చంపి తినినడం కాని నేరం. ఇందుకు కఠిన చట్టాలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే అటవీ ప్రాంతం కుచించ పోవడం, నేరగాళ్ల ఉచ్చుకు బలికావడం పలు కారణాలతో నెమళ్లు అటవీ ప్రాం తాలను వదలి మైదాన ప్రాంతాలకు తరలి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వ్యవసాయం సాగు చేసుకుంటున్న రైతులు పంటల సశ్య రక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రసాయనికి ఎరువులు, గుళికల మందులు వాడ డం మొదలు పెడుతున్నారు. అడవి పందులు నుంచి పంటలను కాపాడుకునేందుక రైతులు గుళికలు మందులు చల్లుతున్నారు. అయితే మైదాన ప్రాంతాల్లో నెమళ్లకు సరైన ఆహారం లభించక పొలాలపై పడుతున్నాయి. ఇక్కడ రైతులు చల్లిన గులికల ను విత్తనాలు అనుకొని తినడంతో నెమళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి జి ల్లాలోని మానవపాడు మండలం చెన్నుపాడు గ్రామంలోని పంట పొలాల్లో గుళికలు తిని 13 నెమళ్లు గత రెండు రోజుల క్రితం మృతి చెందాయి. అలాగే నాగర్‌కర్నూలు జిల్లాలో నిన్న నేడు గగ్గళ్ల పల్లి గ్రామం పంట పొలాల్లో గుళికలు తిని సుమారు 15 నెమళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ వరస సంఘటనలు ప్రకృతి ప్రేమికులకు బాధకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే నేరం నాది ఆకలిదన్నట్లు నెమళ్లు చనిపోవడం, దేశానికి పట్టెడన్నం పెట్టే రైతుల మెడకు కేసులు చుట్టుకోవడం, అటవీ సంరక్షణ చట్టాలు అమలు చేయడం లాంటి ఘటనలతో రైతులు భయ భ్రాంతులకు గురి అవుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్నా రైతులకు ప్రతి ఏటా పెట్టుబడులు రాని పరిస్థితి. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు ప్రతి ఏటా అతివృష్టి, అనా వృష్టితో నష్టపోతూనే ఉన్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతు లు రసాయన ఎరువులు వాడడం పరిపాటిగా మారింది. అయితే ఆ పంటల్లో గుళిక లు తిని నెమళ్లు మృతి చెందుతున్నాయి. అటవీ సంరక్షణ చట్టంను అమలు చేయాలంటే రైతులపై కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత అటవీ అధికారులపై ఉంటుంది. కాని రైతులపై కేసులు నమోదు చేస్తే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఉండడంతో అటవీ శాఖ అధికారులు సందిగ్దంలో ఉన్నారు. తాము పంటను కాపాడుకునేందుకు మందులు వాడితే నెమళ్లు తిని చనిపోతే ఆ తప్పు తమ మీద వేయడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు.
ఆకలి నెమళ్లది అయితే నేరం రైతులది ఎలా అవుతుందని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు.ఇప్పటికే వరస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రైతులపై అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తారా లేక వదిలేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Related Stories: