మసీదును కూల్చివేసిన అటవీ అధికారులు

mosque

మణుగూరు క్రాస్‌రోడ్ వద్ద ఉద్రిక్తత
రహదారిపైనే ప్రార్ధనలు చేసిన ముస్లింలు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు
మన తెలంగాణ/మణుగూరు: అటవీ అధికారులు నిర్మాణంలో ఉన్న మసీద్‌ను పోలీస్ అధికారుల సహయంతో కూల్చివేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మణుగూరు ప్రధాన రహదారిలోని మణుగూరు క్రాస్ రోడ్‌లో గురువారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల ప్రకారం మణుగూరు బూర్గంపాడు ప్రధాన రహదారిలోని మణుగూరు క్రాస్‌రోడ్ వద్ద ముస్లింల పవిత్ర స్థలమైన మసీద్‌ను అటవీ అధికారులు ఎటువంటి ముందస్ధు సమాచారం లేకుండ గురువారం ఉదయం సుమారు 4గంటల సమయంలో భారీ యంత్రాల సహాయంతో కూల్చివేయడంతో దిగ్భ్రాంతికి గురైన ముస్లింలు పెద్దలు ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. అదేవిధంగా మధ్యాహ్న సమయంలో ప్రార్థనలు చేసేందుకు మజీద్ లేకపోవడంతో ప్రధాన రహదారిపై ప్రార్ధన చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మణుగూరు ఎక్స్‌రోడ్‌లో గత 32 సంవత్సరాలుగా నివాసముంటూ ఇక్కడ మసీద్‌ను ఏర్పాటు చేసుకొని ప్రార్థనలు నిర్వహిస్తున్నామని, అటవీ శాఖాధికారులు గదిలొ నమాజ్ చేస్తున్న సమయంలో బయట తలుపులు మూసి మజీద్‌ను కూల్చివేశారని వాపోయారు.

అటవీ శాఖాధికారులను నిలదీయగా మజీద్‌ను రిజర్వ్ అడవి నిర్మించారని, పైఅధికారుల ఉత్తర్వులు నిమిత్తం కూల్చివేశామని చేపుతున్నారని, గత 30ఎళ్ళగా లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని, ఇక్కడ మజీద్‌తో పాటు చర్చి, గుడి కూడా ఉన్నాయని వాటికి లేని అభ్యంతరం మసీద్‌కు ఉందా అంటూ వారు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డుపై భైటాయించారు. ముస్లింలు రాస్తారోకోతో సూమారు రెండు గంటల పాటు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్థంభించింది. ఆనంతరం ముస్లిం మత పెద్దలు జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటన గురించి తెలుసుకున్న పినపాక ఎమ్మేల్యే రేగా కాంతారావు, భధ్రాచలం ఎమ్మేల్యే పోడెం వీరయ్య సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముస్లిం పవిత్ర స్థలమైన మసీద్‌ను అటవీ శాఖాధికారులు కూల్చివేయటం సరికాదని, జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి మసీద్‌ను పునఃనిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు
-ఫారెస్ట్ డివిజనల్ అధికారి మహేందర్ రెడ్డి
రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఎవరైన అక్రమిస్తే చర్యలు తప్పవని ఫారెస్ట్ డివిజనల్ అధికారి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం మణుగూరు క్రాస్‌రోడ్డ్ నిర్మాణంలో ఉన్న మజీద్ కూల్చివేతపై మన తెలంగాణ వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు నుండి వలస వచ్చిన కొందరు ముస్లింలు రిజర్వ్ పారెస్ట్ భూములను అక్రమంగా ఆక్రమించుకోని నివాసముంటున్నారు. గత ఫిబ్రవరిలో అటవీ భూముల్లో అక్రమంగా మసీద్ నిర్మిస్తుండగా హెచ్చరికలు జారీ చేశామన్నారు. కొందరు అటవీ భూము లు అక్రమించుకునేందుకు అటవీ అధికారుల హెచ్చరికలను లెక్కజేయకుండా మజీద్ నిర్మిస్తుండటంతో గురువా రం ఉదయం పొలీస్‌ల సహయంతో నిర్మాణంలో ఉన్న మసీద్‌ను కూల్చివేశామన్నారు. అదేవిధంగా సంఘటన జరిగిన ప్రదేశంలో చిన్న మజీద్ ఉందని అటవీ అధికారు లు దానిని ధ్వంసం చేయలేదని, కేవలం నిర్మాణంలో ఉన్న భవనాన్ని మాత్రమే కూల్చివేశామని తెలిపారు. జరిగిన ఘటనపై బూర్గంపాడు పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, అవసరమైతే అటవీ భూములను ఆక్రమించే వారిపై పీడి యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Forest dept demolishes mall build in name of mosque

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మసీదును కూల్చివేసిన అటవీ అధికారులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.