వాస్తు శాస్త్రంపై విదేశీలు మక్కువ చూపుతున్నారు : వీరమనేని

  హైదరాబాద్ : భారత పురాతన శాస్త్రాలైన యోగా, ఆయుర్వేదంలపై బలమైన నమ్మకంతో వాటిని అభ్యాసం చేసేందుకు పశ్చిమ దేశాలలో అంతగా ప్రాచుర్యంలేని వాస్తు గురించి ఆసక్తితో ముందుకు వస్తున్నారని వాస్తు నిపుణులు డా. వేణుగోపాల్‌రావు వీరమనేని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తాము నివసించే ప్రదేశాలు, పరిసరాలో వ్యత్యాసాల వలన ఏర్పడే లోటు పాట్లను సవరించేందుకు వాస్తు సరైన సమయంలో ఉపయోగపడుతుందన్నారు. వాస్తుపై అవగాహన లేని పాశ్చాత్యులు యోగాను, […] The post వాస్తు శాస్త్రంపై విదేశీలు మక్కువ చూపుతున్నారు : వీరమనేని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : భారత పురాతన శాస్త్రాలైన యోగా, ఆయుర్వేదంలపై బలమైన నమ్మకంతో వాటిని అభ్యాసం చేసేందుకు పశ్చిమ దేశాలలో అంతగా ప్రాచుర్యంలేని వాస్తు గురించి ఆసక్తితో ముందుకు వస్తున్నారని వాస్తు నిపుణులు డా. వేణుగోపాల్‌రావు వీరమనేని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తాము నివసించే ప్రదేశాలు, పరిసరాలో వ్యత్యాసాల వలన ఏర్పడే లోటు పాట్లను సవరించేందుకు వాస్తు సరైన సమయంలో ఉపయోగపడుతుందన్నారు.

వాస్తుపై అవగాహన లేని పాశ్చాత్యులు యోగాను, పరీక్షించి దానిని నమ్మి అనేక ప్రయోజనాలు పొందిన తరువాత ఇప్పుడు ఈ అద్బుత శాస్త్రం అందిస్తున్న అద్భుత ఫలితాలు గుర్తించారని చెప్పారు. అనంతరం బ్రెజిల్‌కు చెందిన అర్కిటెక్ట్ మరియాన బ్రసిల్ ప్రసంగిస్తూ అధ్యాత్మిక గురువు రవిశంకర్ ద్వారా భారతదేశాన్ని, జీవితంలో మంచి విషయాలు గురించి తెలుసుకున్నానని, యోగా, ఆయుర్వేద ద్వారా అధ్బుత ఫలితాలతో ఈరోజున నామనస్సు, శరీరాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోగలుగుతున్నానని పేర్కొన్నారు. ఈసమావేశంలో సారా బాటెల్లి, ఎంఎస్ డారియా పాల్గొన్నారు.

Foreigners are Passionate about Architecture

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వాస్తు శాస్త్రంపై విదేశీలు మక్కువ చూపుతున్నారు : వీరమనేని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.