నెలసరి సమస్యకు…గుప్తపద్మాసనంతో చెక్…

  కొంతమంది మహిళలకు నెలసరి సమయానికి రాదు. అయితే అధిక రక్తస్రావం లేదా తక్కువగా కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి కూడా ఉంటుంది. వీటన్నింటినీ అదుపులో ఉంచాలంటే గుప్తపద్మాసనం ప్రయత్నించాలి. ఎలా చేయాలంటే…: మొదట పద్మాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు చేతులను పైకి ఎత్తాలి. శరీరాన్ని మోకాళ్ల మీద పైకి లేపి చేతుల సాయంతో ముందుకు నేలపై వంగాలి. చుబుకాన్ని భూమికి తాకించాలి. చేతులను వీపు వెనక్కి తీసుకువెళ్లి నమస్కార […] The post నెలసరి సమస్యకు… గుప్తపద్మాసనంతో చెక్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొంతమంది మహిళలకు నెలసరి సమయానికి రాదు. అయితే అధిక రక్తస్రావం లేదా తక్కువగా కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి కూడా ఉంటుంది. వీటన్నింటినీ అదుపులో ఉంచాలంటే గుప్తపద్మాసనం ప్రయత్నించాలి.
ఎలా చేయాలంటే…: మొదట పద్మాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు చేతులను పైకి ఎత్తాలి. శరీరాన్ని మోకాళ్ల మీద పైకి లేపి చేతుల సాయంతో ముందుకు నేలపై వంగాలి. చుబుకాన్ని భూమికి తాకించాలి. చేతులను వీపు వెనక్కి తీసుకువెళ్లి నమస్కార ముద్రలో ఉంచాలి.
లాభాలు: ఈ ఆసనం రోజూ వేయడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. గర్భాశయం ఆరోగ్యంగా ఉండి సంతానసాఫల్య సామర్థ్యం పెరుగుతుంది. నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.
జాగ్రత్తలు: పద్మాసనం బాగా వేయగలిగేవారే ఈ ఆసనం వేయాలి. అల్సరు, గుండె జబ్బులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు దీన్ని వేయొద్దు.

 

For monthly issue … check with Gupta Padmasanam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నెలసరి సమస్యకు… గుప్తపద్మాసనంతో చెక్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.