మెనోపాజ్‌లోనూ యవ్వనంగా..!

 Menopause

 

వయసు నలభై దాటితే నేత చీరలకు, చుడీదార్లకు పరిమితం కానవసరం లేదు. తాజా ట్రెండ్లు ఫాలో అవడానికి వెనకాడకుండా, అటు పాత తరం, ఇటు కొత్త తరం ఈర్ష్యపడేలా ఈ ఫ్యాషన్ ట్రెండ్స్ పాటించండి! స్టైల్‌గా కనిపించడంతోపాటు, హూందాగానూ వెలిగిపోతారు!

ఇవి వద్దు: మోకాళ్ల పై వరకూ పొడవుండే టాప్స్, పాటియాలా ప్యాంట్లు, ఎంబ్రాయిడరీ టాప్స్, వీటితోపాటు…. లాంగ్ ప్రింటెడ్ స్కర్ట్, ఎ లైన్ స్కర్ట్, వదులుగా ఉండే ప్యాంట్లు, పెద్ద సైజు టీ స్కర్ట్…ఇలాంటివి మీ వార్డ్‌రోబ్‌లో ఉంటే వాడకం మానేయండి.

జీన్స్ బెస్ట్: ఒంటికి అతుక్కునే స్కిన్ టైట్ కాకుండా, స్ట్రెయిట్ కట్ జీన్స్ బాగుంటాయి. నడుము వెడల్పుగా ఉంటే, బూట్ కట్ జీన్స్ ఎంచుకోవాలి. అలాగే ఎలాంటి జీన్స్ ఎంచుకున్నా ‘స్ట్రెచబుల్’ రకం ఎంచుకోవాలి.

కలర్‌ఫుల్: వయసు పెరుగుతోంది కదా! అని చర్మపు రంగులో కలిసిపోయే రంగులు, వెలసిపోయిన రంగులు ఎంచుకోకూడదు. ముదురు రంగు చర్మం ఉంటే, ఏ ముదురు రంగు టాప్స్ అయినా ఎంచుకోవచ్చు. తెల్లగా ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది? క్లాసీగా కనిపించాలనుకుంటే, లేత రంగులు, నలుగురినీ అట్రాక్ట్ చేయాలనుకుంటే ఎరుపు, పసుపు, గులాబీ రంగులు బాగుంటాయి.

హై హీల్స్: ఫ్లాట్ హీల్స్ తక్కువగా హై హీల్స్ ఎక్కువగా వాడాలి. హై హీల్స్‌లో బ్లంట్ టైప్, ఒకటి లేదా ఒకటిన్నర అంగుళం పొడవుండే హీల్స్ సౌకర్యంగా ఉంటాయి.

Follow the Fashion Trends in Menopause

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మెనోపాజ్‌లోనూ యవ్వనంగా..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.