ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపండి…

  బిజెపి మహిళా ఎంపీల భేటీలో మోడీ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చిన సందర్భంగా బిజెపి మహిళా ఎంపీలను కలుసుకున్నారు. ఆరోగ్యం, పారిశుధ్యం, పిల్లల్లో పోషకాహార లోపాన్ని తొలగించడం వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా ఆయన వారిని కోరారు. ఈ సమావేశానికి 30 మందికి పైగా మహిళా ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను మోడీతో సమగ్రంగా పంచుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వారు […] The post ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బిజెపి మహిళా ఎంపీల భేటీలో మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చిన సందర్భంగా బిజెపి మహిళా ఎంపీలను కలుసుకున్నారు. ఆరోగ్యం, పారిశుధ్యం, పిల్లల్లో పోషకాహార లోపాన్ని తొలగించడం వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా ఆయన వారిని కోరారు. ఈ సమావేశానికి 30 మందికి పైగా మహిళా ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను మోడీతో సమగ్రంగా పంచుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

వారు చెప్పినవి ఓపిగ్గా విన్న ప్రధాని, ప్రతి మహిళ ఎంపీలోనూ ఒక వ్యవస్థ ఉందని సమావేశానికి హాజరైన ఒక మహిళతో ఆయన అన్నారు. మహిళలుగా వారిలో ఎన్నో గొప్ప నైపుణ్యాలున్నాయని, ప్రజలకు బాగా దగ్గరయ్యేందుకు అవి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. పార్టీలో వివిధ వర్గాల పార్లమెంట్ సభ్యులతో మోడీ వరసగా జరుపుతున్న సమావేశాల్లో ఇది ఐదోవది. పార్టీ ఎంపీలను ఏడు వర్గాలుగా విభజించారు. మోడీ ఇప్పటికే బిజెపికి చెందిన ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు, యువ ఎంపీలు, ఒకప్పటి మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశాలవల్ల బిజెపి ఎంపీలకు ప్రత్యక్షంగా ప్రధానితో మాట్లాడే అవకాశం లభిస్తుంది.

Focus on health and sanitation

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: