ఎన్‌ఎస్‌డిసితో చేతులు కలిపిన ఫ్లిప్‌కార్ట్

Flipkart

 

న్యూఢిల్లీ: వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డిసి)కి చెందిన లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్‌తో చేతులు కలిపింది. దీనిలో భాగంగా తమ సంస్థలోని 20 వేల మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు శిక్షణ ఇప్పించనుంది. వీరందరికీ ప్రాడక్ట్ డెలివరీ, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక ఈకామర్స్ కంపెనీకి, లాజిసిక్స్ సెక్టార్స్ స్కిల్ కౌన్సిల్‌కు మధ్య ఒప్పందం కుదరడం ఇదే మొదటిసారి. పంపిణీ వ్యవస్థలోని మరో 30,000 మంది ఉద్యోగులకు ఫ్లిప్‌కార్ట్ ఇక్కడ శిక్షణ ఇప్పించే అవకాశం ఉంది. వీరందరికి డెలివరీకి సిద్ధం చేసే విధానాలు, స్థానిక రవాణా చట్టాలు, ఎండ్ టు ఎండ్ సప్లై చైన్‌పై అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణ మేలో మొదలైంది. ఇప్పటివరకు 4 వేల మందికి శిక్షణ ఇచ్చారు.

Flipkart joined with NSDC

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎన్‌ఎస్‌డిసితో చేతులు కలిపిన ఫ్లిప్‌కార్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.