రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

రంగారెడ్డి : ఆమనగల్లు మండలం మేడిగడ్డ సమీపంలో సోమవారం మధ్యాహ్నం  ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం, లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు  చనిపోయారు. ఇన్నోవా వాహనం డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. వరంగల్‌ జిల్లా మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి […] The post రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : ఆమనగల్లు మండలం మేడిగడ్డ సమీపంలో సోమవారం మధ్యాహ్నం  ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం, లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు  చనిపోయారు. ఇన్నోవా వాహనం డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. వరంగల్‌ జిల్లా మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి దర్శనానికి వెళ్లారు. స్వామి వారి దర్శనానంతరం శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వైపు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం  శ్రీశైలం – హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్గాప్రసాద్‌, ఆయన కొడుకు శాంతన్‌, బావ రాజు, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన భార్య విజయలక్ష్మి, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే విజయలక్ష్మి చనిపోయింది. కారు డ్రైవర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది.  పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Five People Dead in Road Accident At Medigadda

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: