లారీ ఢీకొని డిసిఎం బోల్తా: 5 ఎద్దులు మృతి

    మన తెలంగాణ/కట్టంగూర్‌: 65వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 ఎద్దులు మృతి చెందగా, మరో 8 ఎద్దులు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని అయిటిపాముల గ్రామశివారులో గల చెర్వుఅన్నారం స్టేజీ సమీపంలోని దాబావద్ద గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎపి36వై8558 డిసిఎంలో 15 ఎద్దులను విజయవాడ నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మార్గమద్యలోని అయిటిపాముల గ్రామ శివారులోని దాబా వద్దకు రాగానే […]

 

 

మన తెలంగాణ/కట్టంగూర్‌: 65వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 ఎద్దులు మృతి చెందగా, మరో 8 ఎద్దులు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని అయిటిపాముల గ్రామశివారులో గల చెర్వుఅన్నారం స్టేజీ సమీపంలోని దాబావద్ద గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎపి36వై8558 డిసిఎంలో 15 ఎద్దులను విజయవాడ నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మార్గమద్యలోని అయిటిపాముల గ్రామ శివారులోని దాబా వద్దకు రాగానే వెనుకనుండి వస్తున్న టిఎస్05యుబి3549 లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి, డిసిఎంను ఢీకొట్టాడు. దీంతో డిసిఎం పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ క్రమంలో డిసిఎం పూర్తిగా నుజ్జునుజ్జయి, చక్రాలు ఊడిపోయాయి. డిసిఎంలోని ఎద్దులు చెల్లాచెదురుగా కిందపడ్డాయి. డిసిఎంలో తరలిస్తున్న 13 ఎద్దులకుగాను 5 ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 ఎద్దులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీసారు. అయిటిపాముల గ్రామ విఆర్‌వో శ్రవన్‌కుమార్ ఫిర్యాదు మేరకు డిసిఎం డ్రైవర్, లారీ డ్రైవర్‌లపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్సై వెంకటయ్య తెలిపారు.

 

Five Live Stock Dead in Road Accident in Nalgonda

 

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: