బాంబు పేలుడులో ఐదుగురు మృతి

పాకిస్థాన్‌ : లాహోర్ బుధవారం ఉదయం  ఉగ్రవాదులు  బాంబు పేలుడుకు పాల్పడ్డారు. లాహోర్‌లోని డాటా దర్బార్ వద్ద  ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు ఈ బాంబు దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. బాంబు పేలుడు ధాటికి రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బాధితుల […] The post బాంబు పేలుడులో ఐదుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పాకిస్థాన్‌ : లాహోర్ బుధవారం ఉదయం  ఉగ్రవాదులు  బాంబు పేలుడుకు పాల్పడ్డారు. లాహోర్‌లోని డాటా దర్బార్ వద్ద  ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు ఈ బాంబు దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. బాంబు పేలుడు ధాటికి రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. శవ పరీక్ష కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడింది ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులో తెలియరాలేదని డిఐజి(ఆపరేషన్స్ లాహోర్) అహ్మద్ ఖాన్ తెలిపారు. పోలీసులను టార్గెట్ గా చేసుకుని ఈ దాడి జరిగినట్టు అర్ధమవుతుందని ఆయన చెప్పారు.

Five Killed in Bomb Blast At Pak

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బాంబు పేలుడులో ఐదుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: