ట్యాంకర్ పేలి  ఐదుగురు కార్మికులకు తీవ్రగాయాలు 

తాండూర్‌:మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేపెల్లి వాడ లోని గ్లోబల్ సిరామిక్స్ ప్లాంట్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డాంబర్ ప్లాంట్ వద్ద ట్యాంకర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో యాజమాని సలావుద్దీన్‌తో పాటు మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా వారిని మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడడంతో గాయపడిన కార్మికులను రక్షించేందుకు అవకాశం […]

తాండూర్‌:మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేపెల్లి వాడ లోని గ్లోబల్ సిరామిక్స్ ప్లాంట్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డాంబర్ ప్లాంట్ వద్ద ట్యాంకర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో యాజమాని సలావుద్దీన్‌తో పాటు మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా వారిని మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడడంతో గాయపడిన కార్మికులను రక్షించేందుకు అవకాశం లేకపోగా పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో గ్లోబల్ సిరామిక్స్ యాజమాని సలావుద్దీన్ , కేశవ్(మహారాష్ట్ర), బ్రీజేష్ (మధ్యప్రదేశ్)తో పాటు రేపెల్లి వాడకు చెందిన కోట శంకర్, చీకటి సాయి తేజలు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక ట్యాంకర్ నుంచి డాంబర్‌ను వేరే ట్యాంకర్‌లోకి మారుస్తుండగా ఏర్పడిన గ్యాస్ వల్ల మంటలు వెలువడ్డాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడగా పెద్ద శబ్దానికి ట్యాంకర్ తునాతునకలయ్యాయి. శబ్దం విన్న స్థానిక రేపెల్లి వాడ గ్రామస్థులు ప్లాంట్ వద్దకు చేరుకొని వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా వారు స్థానికంగా వైద్య సేవలు అందించి, అక్కడి నుంచి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసిపి బాలుజాదవ్ సందర్శించి జరిగిన ప్రమాదంపై విచారణ జరిపారు. డాంబర్ ప్లాంట్‌కు అనుమతి ఉందా .. లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.

Related Stories: