చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

  మన తెలంగాణ/పాపన్నపేట: చేపలు పట్టడానికి వెళ్లి ఓ వ్యక్తి నదిలో చిక్కుకుపోయి మరణించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చీకోడు గ్రామానికి చెందిన బెస్త సంగయ్య(42) తండ్రి భూమయ్య, మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. గురువారం ఉదయం చేపలు పట్టడానికి మంజీరానది పరివాహాక ప్రాంతంలో చేపల వేటకు సంగయ్య వెళ్లాడు. సాయంత్రం వరకు సంగయ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు […]

 

మన తెలంగాణ/పాపన్నపేట: చేపలు పట్టడానికి వెళ్లి ఓ వ్యక్తి నదిలో చిక్కుకుపోయి మరణించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చీకోడు గ్రామానికి చెందిన బెస్త సంగయ్య(42) తండ్రి భూమయ్య, మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. గురువారం ఉదయం చేపలు పట్టడానికి మంజీరానది పరివాహాక ప్రాంతంలో చేపల వేటకు సంగయ్య వెళ్లాడు. సాయంత్రం వరకు సంగయ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు మంజీరానది పరివాహాక ప్రాంతానికి వెళ్లి వెతకడతో నదిలో చేపల వలకు చిక్కుకొని నీటిలో మునిగి మరణించినట్లుగా సంగయ్యను గుర్తించామని పాపన్నపేట ఎస్సై అంజనేయులు తెలిపారు. మృతుని భార్య బెస్త మల్లేశ్వరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

 

Fishermen Dead in Manjeera River

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: