ట్రంప్ సెక్యూరిటీలో తొలి సిక్కు…

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీ టీమ్‌లో తొలి సిక్కు అన్ష్‌దీప్ సింగ్ భాటియా చోటు సంపాదించుకున్నాడు. లుధియానా వాసి అయిన భాటియా కఠినమైన శిక్షణ అనంతరం అతడిని గత వారం ట్రంప్ సెక్యూరిటీ టీమ్‌లో నియమించారు. 1984 సిక్కుల ఊచకోత సమయంలో అతని కుటుంబం కాన్పూర్ నుంచి పంజాబ్‌లోని లుధియానాకు వలసవెళ్లింది. ఈ దాడుల్లో అతని కుటుంబికులు కూడా మరణించారు. అతని తండ్రి దేవేంద్ర సింగ్ కూడా ఈ దాడుల్లో తీవ్ర గాయలపాలయ్యాడు. అతనికి […]

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీ టీమ్‌లో తొలి సిక్కు అన్ష్‌దీప్ సింగ్ భాటియా చోటు సంపాదించుకున్నాడు. లుధియానా వాసి అయిన భాటియా కఠినమైన శిక్షణ అనంతరం అతడిని గత వారం ట్రంప్ సెక్యూరిటీ టీమ్‌లో నియమించారు. 1984 సిక్కుల ఊచకోత సమయంలో అతని కుటుంబం కాన్పూర్ నుంచి పంజాబ్‌లోని లుధియానాకు వలసవెళ్లింది. ఈ దాడుల్లో అతని కుటుంబికులు కూడా మరణించారు. అతని తండ్రి దేవేంద్ర సింగ్ కూడా ఈ దాడుల్లో తీవ్ర గాయలపాలయ్యాడు. అతనికి మూడు బుల్లెట్ గాయాలయ్యాయి. లుధియానాకు వలస వెళ్లిన తర్వాత దేవేంద్ర సింగ్ ఫార్మాసూటికల్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2000వ సంవత్సరంలో వీరి కుంటుంబం అమెరికాకు వలస వెళ్లారు. ఆ సమయంలో అన్ష్‌దీప్ వయసు 10 ఏండ్లు. అధ్యక్షుడి సెక్యూరిటీ టీమ్‌లో ఉండాలన్నదే తన లక్ష్యంగా అన్ష్‌దీప్ పెట్టుకున్నాడు. మొత్తానికి అనుకున్నది అన్ష్‌దీప్  సాధించాడు.

Comments

comments

Related Stories: