నడిరోడ్డుపై తగలబడిపోయిన స్కార్పియో కారు

Mahindra Scorpioరాజాపూర్: రోడ్డుపై వెళ్తున్న సమయంలో మహీంద్ర స్కార్పియో కారు ఒక్కసారిగా తగలబడిపోయిన సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండల సమీపంలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ బాలయ్య తెలిపిన వివరాల ప్రకారం… కర్నూల్ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న (ఎపి28 డిఎ0201) నెంబర్ గల స్కార్పియో వాహనంలో ఊహించని విధంగా మంటలు చెలరేగాయి. స్కార్పియో వాహనం రోడ్డుపై వెళ్తున్న సందర్భంలోనే ఇంజన్‌లో లోపం వల్ల ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలను గమనించిన స్కార్పియో ఓనర్, డ్రైవర్ రంగోజి రావు వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేసి దూరంగా వెళ్లిపోవడంతో ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. కారులో ఒక్కరే ప్రయాణిస్తుండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్కార్పియో వాహనం తన కళ్లముందే కాలి బూడిదయిందని రంగోజి రావు వాపోయారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండడంతో వాహనదారులు, ప్రజల భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

Fire in Mahindra Scorpio Vehicle at Mahabubnagar Dist

The post నడిరోడ్డుపై తగలబడిపోయిన స్కార్పియో కారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.