బైక్ రిపేరింగ్ షాప్‌లో అగ్ని ప్రమాదం

Bike Repair Shop

 

మెదక్ : బైక్ రిపేరింగ్ షాప్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి 10 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమైన సంఘటన మండల కేంద్రమైన పాపన్నపేటలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పాపన్నపేటలోని నూతన ఎంపిడివో కార్యాలయం ఎదురుగా మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన అబ్దులం మన్నాన్ అనే యువకుడు గత కొంతకాలంగా బైక్ రిపేరింగ్ షాప్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు.

మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో షాప్‌లో ఉన్న 10 ద్విచక్రవాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటిలో రెండు నూతన వాహనాలు ఉన్నాయి. దీంతో 6 లక్షల ఆస్తి నష్టం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఆర్‌ఐ ప్రసాద్ పంచనామా నిర్వహించగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. దగ్ధమైన బైకుల నష్టపరిహారాన్ని ప్రభుత్వం తరపున చెల్లించి తనను ఆదుకోవాలని బాధితుడు అబ్దుల్ మన్నన్ కోరాడు.

 

Fire in Bike Repair Shop

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బైక్ రిపేరింగ్ షాప్‌లో అగ్ని ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.