108కి నిప్పు

  హైదరాబాద్: మన తెలంగాణ/ పేట్‌బషీరాబాద్:అనుమానాస్పద స్థితిలో జివికె ఈఎంఆర్‌ఐ కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న 10-8 అం బులెన్స్ వాహనాలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పో లీస్‌స్టేషన్ పరిధిలోని దేవరాయాంజల్ గ్రామ పరిధిలో సోమవారం మధ్యాహ్నం చోటు చే సుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. శామీర్‌పేట మండల పరిధిలోని దేవరయాంజల్ గ్రామంలో ఉన్న 39 ఎకరాల్లో విస్తరించిన జివికె ఈఎంఆర్‌ఐ కేంద్రంగా నగరంలో అన్ని వర్గాల వారికి మొత్తం 42 […] The post 108కి నిప్పు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: మన తెలంగాణ/ పేట్‌బషీరాబాద్:అనుమానాస్పద స్థితిలో జివికె ఈఎంఆర్‌ఐ కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న 10-8 అం బులెన్స్ వాహనాలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పో లీస్‌స్టేషన్ పరిధిలోని దేవరాయాంజల్ గ్రామ పరిధిలో సోమవారం మధ్యాహ్నం చోటు చే సుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. శామీర్‌పేట మండల పరిధిలోని దేవరయాంజల్ గ్రామంలో ఉన్న 39 ఎకరాల్లో విస్తరించిన జివికె ఈఎంఆర్‌ఐ కేంద్రంగా నగరంలో అన్ని వర్గాల వారికి మొత్తం 42 వాహనాలతో అత్యవసర సేవలను అందిస్తున్నాది. అయితే ఈ కేంద్రం నుంచి నిర్వహణ జరుగుతున్నందున గత 10 సంవత్సరాల నుంచి మరమ్మతులకు వచ్చినవి, ఇతర కారణాల వల్ల వినియోగంలో లేని 108 వాహనాలను తమ కేంద్రంలోని ఖాళీ స్థలంలో నిలుపుతున్నారు. అక్కడ మొత్తం 75 వాహనాల వరకు ఉన్నా యి. అయితే, పరిసర ప్రాంతాలలో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టడంతో గాలికి ఆ మంటల నిప్పు రవ్వలు నిలిపి ఉన్న వాహనాలపై పడడంతో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదంతో ఏర్పడిన దట్టమైన పొగలను గమనించిన స్థానికులు పేట్‌బషీరాబాద్ పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి రెండు అగ్నిమాపక వాహనాలు, నాలుగు ట్యాంకులు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఇక్కడ సుమారు 60 వాహనాలు అగ్ని ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు ఆరిపోగానే సమగ్రంగా పరిశీలించి, ప్రమాదానికి కారణాలను గుర్తించడంపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని జివికె డిప్యూటీ మేనేజర్ శ్రీకర్ వివరించారు. అగ్ని ప్రమాద సంఘటనను చిత్రికరించేందుకు మీడియాను అనుమతించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది.

 

Fire Broke Out on 108 Vehicles in Shameerpet in Medchal 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 108కి నిప్పు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: