లొంగన్‌లో భారీ అగ్ని ప్రమాదం

  కరీంనగర్: మండలంలోని లొంగన్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన  వివరాల ప్రకారం… కోరే రాజప్పా అనే వ్యక్తికి చెందిన చిన్న కిరాణ షాపులో అగ్ని ప్రమాదం జరగడంతో పక్కనున్న కొట్టంలో కూడ నిప్పంటుకుని నిల్వ ఉంచిన 80 క్వింటాళ్ళ కందులు, జొన్నలు, బియ్యం, నిత్యవసర సరుకులతో పాటు కొట్టంలోని పైపులు, బైకు కాలి బూడిదయిపోయాయి. ఆస్తి నష్టం లక్షల్లో జరిగిందని వారు అంచనా వేస్తున్నారు. ఎవరో కావాలనే […] The post లొంగన్‌లో భారీ అగ్ని ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరీంనగర్: మండలంలోని లొంగన్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన  వివరాల ప్రకారం… కోరే రాజప్పా అనే వ్యక్తికి చెందిన చిన్న కిరాణ షాపులో అగ్ని ప్రమాదం జరగడంతో పక్కనున్న కొట్టంలో కూడ నిప్పంటుకుని నిల్వ ఉంచిన 80 క్వింటాళ్ళ కందులు, జొన్నలు, బియ్యం, నిత్యవసర సరుకులతో పాటు కొట్టంలోని పైపులు, బైకు కాలి బూడిదయిపోయాయి. ఆస్తి నష్టం లక్షల్లో జరిగిందని వారు అంచనా వేస్తున్నారు. ఎవరో కావాలనే గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి నిప్పంటించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోరే రాజప్పా కిరాణ షాపు నడుపుతూ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటుండేవాడు. గురువారం అర్ధరాత్రి సమయానికి ముందు సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో వర్ష వాతవరణం ఉండటంతో కొద్దిపాటి వర్షం కూడ పడింది. వర్షం ఆగిన తరువాత ఈ సంఘటన జరిగి ఉంటుందాని ఎవరో గిట్టనివారే ఈ పని చేసి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిపోయిన తరవాత శుక్రవారం అగ్ని మాపక సిబ్బంది వచ్చి వెళ్ళారని తెలిపారు.

Fire Accident in Karimnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లొంగన్‌లో భారీ అగ్ని ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: