గోల్డెన్‌ గేట్ హోటల్‌లో అగ్నిప్రమాదం

Fire Accidentమధ్యప్రదేశ్‌ : ఇండోర్‌లోని గోల్డెన్‌ గేట్ హోటల్‌లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐదంతస్తుల హోటల్‌ భవనంలోని మొదటి అంతస్తులో మొదలైన మంటలు ఐదు అంతస్తులకు వ్యాపించాయి. దీంతో హోటల్ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.  అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. హోటల్ లో చిక్కుకున్న 12 మందిని పోలీసులు రక్షించారు. హోటల్ సమీపంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాదం ఉదయం పూట జరగడంతో హోటల్ లో ఎక్కువ మంది లేరు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే భారీగా ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు.

Fire Accident At Golden Gate Hotel In Indore At MP

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గోల్డెన్‌ గేట్ హోటల్‌లో అగ్నిప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.