గాయని కనికా కపూర్‌పై కేసు నమోదు

  లక్నో : బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్‌పై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంపై ఆమెపై ఐపిసి 269, 270,188 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు అయింది. లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదుపై ఆమెపై శుక్రవారం సరీజినీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు పోలీస్ కమిషనర్ సుర్జిత్ పాండే చెప్పారు. కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి […] The post గాయని కనికా కపూర్‌పై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లక్నో : బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్‌పై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంపై ఆమెపై ఐపిసి 269, 270,188 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు అయింది. లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదుపై ఆమెపై శుక్రవారం సరీజినీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు పోలీస్ కమిషనర్ సుర్జిత్ పాండే చెప్పారు. కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆమె పూర్తిగా క్వారంటైన్‌లో ఉండాలని వైద్య చికిత్స తీసుకోవాలని వైద్యులు చెప్పినా ఆమె నిర్లక్షం వహించారు. అంతేకాదు ఆమె లక్నో లోని మూడు చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేశారని పోలీసులు చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె గత ఐదు రోజులుగా ఫ్లూ లక్షణాలు ఎక్కువై బాధపడుతున్నట్టు వెల్లడించారు. కపూర్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తాము వెళ్లిన తరువాత తాను, తన కుమారుడు దుష్యంత్ సింగ్ స్వీయ నిర్బంధం లోకి వెళ్లామని శుక్రవారం రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే చెప్పారు. ఉత్తర ప్రదేశ్ ఆరోగ్యమంత్రి జై ప్రతాప్ సింగ్ కపూర్ లక్నో కార్యక్రమానికి వెళ్లిన తరువాత కరోనా పరీక్ష చేయించుకున్నారు. అలాగే సింగ్‌తో సమావేశంలో పాల్గొన్న అధికారులంతా స్వీయ నిర్బంధం లోకి వెళ్లారు.

FIR against singer Kanika Kapoor

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గాయని కనికా కపూర్‌పై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: