హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం

Financial assistance

 

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆర్మ్‌డ్ రిజర్వు హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆర్థిక సాయం అందజేశారు. నేరేడ్‌మెట్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు అందజేశారు. హెడ్‌కానిస్టేబుల్ మునవర్ భార్య తనవీర్‌కు 7,98,320 రూపాయల చెక్కును అందజేశారు. అంబర్‌పేటలోని ఆర్మ్‌డ్ రిజర్వులో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సయ్యద్ మునవర్ విధినిర్వహణలో భాగంగా మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందాడు. కార్యక్రమంలో అడిషనల్ డిసిపి శిల్పవల్లి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్ భద్రారెడ్డి, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

Financial assistance to head constable family

The post హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.