ప్రగతి సహజమయితే మీ సంగతేంటీ…?

  చిదంబరంపై ఆర్థిక మంత్రి నిర్మల ఫైర్ న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై చర్చకు తమ సమాధానంలో చిదంబర ప్రశ్నలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లోని అంశాలపై తీవ్రస్థాయిలో, తన వద్ద ఉన్న కీలక సమాచారంతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి తమ జవాబులో శుక్రవారం అంశాల వారిగా రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. మొత్తం 102 నిమిషాల పాటు ప్రస్తుత ఆర్థిక మంత్రి […] The post ప్రగతి సహజమయితే మీ సంగతేంటీ…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చిదంబరంపై
ఆర్థిక మంత్రి నిర్మల ఫైర్

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై చర్చకు తమ సమాధానంలో చిదంబర ప్రశ్నలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లోని అంశాలపై తీవ్రస్థాయిలో, తన వద్ద ఉన్న కీలక సమాచారంతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి తమ జవాబులో శుక్రవారం అంశాల వారిగా రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. మొత్తం 102 నిమిషాల పాటు ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రసంగం సాగింది.

ఇందులో దాదాపుగా 45 నిమిషాలను ఆర్థిక మంత్రి మాజీ మంత్రి లేవెనెత్తిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికే కేటాయించినట్లు వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్షం అంటూ గొప్పలకు పోతోందని, అయితే ఇది అయ్యే పనికాదని చిదంబరం తమ విమర్శలలో తేల్చిచెప్పారు. దీనిని ఆర్థిక మంత్రి తమ జవాబులో తోసిపుచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతి ఐదేళ్లకోసారి స్వతహసిద్ధంగా పెరుగుతుందని, ఇది మనీలెండర్లు కూడా చెప్పగలరని, ఇదేం ఘనత కాదని చిదంబరం చేసిన వ్యాఖ్యలను మంత్రి ప్రస్తావించారు. ఇదే నిజం అయితే యుపిఎ హయాంలో ఆర్థిక వ్యవస్థపై ఎందుకు దృష్టి పెట్టలేదని, దీనికి బదులుగా స్కామ్‌లు ఎందుకు పుట్టుకొచ్చాయని ప్రశ్నించారు.

గతంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రతి ఆర్థిక మంత్రిని తాను గౌరవిస్తానని, చిదంబరం ఆర్థిక మం త్రిగా ఉన్నప్పుడు తలెత్తిన కొన్ని లోటుపాట్లను ఇప్పుడు సరిదిద్దడం జరిగిందని అన్నారు. ద్రవ్యలోటును కట్టడి చేశామని, ఆదాయ స్వచ్ఛంద వెల్లడికి పథకం, విదేశాలలో పార్టిసిపేటరీ నోట్ల విక్రయాలు వంటివాటిని గుర్తించాల్సి ఉందన్నారు. పలు కీలక రంగాలలో నిర్ధేశిత లక్షాలను ఆషామాషీగా ఖరారు చేసుకోలేదని, వీటికి సరైన వ్యూహాలు, ప్రణాళికలు ఎంచుకుని, పూర్తిగా వాస్తవికత తో సాగిందని, లక్షాన్ని ఎంచుకోవడమే కాకుండా దానిని చేరుకోవడం కూడా కీలకంగా మలుచుకున్నామన్నారు. సామాజిక రంగానికి వ్యయంలో ఎటువంటి తగ్గింపులు లేకుండానే అనుకున్నది సాధిస్తామని తెలిపారు.

మాజీ ఆర్థిక మంత్రి వైఖరి విడ్డూరంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ దానంతట అదే పెరుగుతుందని ఆయన చెప్పారని, అందుకే వారు నిశ్చింతగా ఉండి వ్యక్తిగత ఆదాయాలు పెంచుకునేందుకు యత్నించి ఉంటారని, ఈ దిశలోనే కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని అనుకోవాలా? అని అంటూ బడ్జెట్‌ను గతంలో పలు సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తి అసలు దేనిని ఎందుకు ఆపాదించదల్చుకున్నారో తెలియడం లేదన్నారు. మాజీ మంత్రి అసంబద్ధ అంశాలను అనేకం ప్రస్తావించడం జరిగింది కాబట్టి తాను కూడా నిర్థిష్టంగా వాటిపై స్పందించాల్సి వచ్చిందని ఆర్థిక మంత్రి చెప్పారు. చిదంబరం పలు గణాంకాలను ప్రస్తావించారు. అవి ఆకర్షణీయంగా ఉన్నాయి. అచ్చెరువు కల్గించేలా అన్పించాయి.

నిజంగానే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. ఎంతైనా అనుభవజ్ఞుడు కదా…ఇరుకున పెట్టే తీరు తెలిసి ఉంటుంది. దీనిని గమనించే తాము ఆయన మాటలను తేలికగా తీసుకోకుండా అంశాల వారిగా స్పందించాల్సి వస్తుందని నిర్మల తెలిపారు. అనుభవజ్ఞులైన ఆర్థిక మంత్రుల నుంచి తాను ఖచ్చితంగా పాఠాలు నేర్చుకుంటానని చెప్పారు. అయితే ఆయన వక్రీకరణకు దిగారు, గేలి చేశారు, ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని నిదించారని, దీనితోనే తగు సమాధానం ఇచ్చుకోవల్సి వస్తోందన్నారు. ఏది ఏమైనా ఆయన తప్పుడు వ్యాఖ్యలకు దిగినందుకు తాను చింతించాల్సి వస్తోందన్నారు.

స్వాతంత్య్ర భారతదేశ తొలి 60 ఏళ్లలో ఏటా ఆర్థిక వ్యవస్థ రెండింతలు అయిందా? దీనికి ఏం జవాబు చెపుతారు? అని నిర్మల ప్రశ్నించారు. ప్రభుత్వం ఎటువంటి నిర్మానాత్మక సంస్కరణలు చేపట్టలేదని చిదంబరం పేర్కొనడాన్ని వక్రీకరణగా మంత్రి తిప్పికొట్టారు. జిఎస్‌టి, ఇన్‌సాల్వెన్సీ, దివాళా సంస్థల కట్టడి నిబంధనలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనకరణ, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి అంశాలు ఆయనకు తెలియచేయాల్సి వస్తోందని అన్నారు.

Finance Minister Nirmala Fire on Chidambaram

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రగతి సహజమయితే మీ సంగతేంటీ…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: