తెలంగాణ హక్కుల కోసం పోరాటం : వినోద్

కరీంనగర్ : కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన హక్కులు, నిధుల కోసం పోరాటం చేస్తామని కరీంనగర్ మాజీ ఎంపి, టిఆర్ఎస్ అగ్రనేత వినోద్ తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని ఆయన పేర్కొన్నారు. జాతీయ భావం పని చేసి బిజెపి గెలిచిందని ఆయన చెప్పారు. మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారిలో అధికులు బిజెపికి ఓటేశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ చేసిన దాడులు బిజెపికి […] The post తెలంగాణ హక్కుల కోసం పోరాటం : వినోద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్ : కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన హక్కులు, నిధుల కోసం పోరాటం చేస్తామని కరీంనగర్ మాజీ ఎంపి, టిఆర్ఎస్ అగ్రనేత వినోద్ తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని ఆయన పేర్కొన్నారు. జాతీయ భావం పని చేసి బిజెపి గెలిచిందని ఆయన చెప్పారు. మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారిలో అధికులు బిజెపికి ఓటేశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ చేసిన దాడులు బిజెపికి అనుకూలంగా మారాయని ఆయన తెలిపారు. వచ్చే రోజుల్లో తెలంగాణకు నిధులు సాధించేందుకు కేంద్రంపై పోరాడుతామని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు సాధించేందుకు తాను ఎంతగానే కృషి చేశానని వినోద్ వెల్లడించారు. ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని, తెలంగాణలో అధికారంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని కార్యకర్తలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

Fight For Telangana Rights : Vinod

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలంగాణ హక్కుల కోసం పోరాటం : వినోద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: