తండాలో ఘర్షణ

నాటు బాంబులు, రాళ్లు, కర్రలు, బీరు సీసాలతో పరస్పర దాడులు 20 ఇళ్లు, 30 ద్విచక్రవాహనాలు ధ్వంసం పలువురికి గాయాలు భయం గుప్పిట్లో కృష్ణపట్టె గ్రామస్థులు మన తెలంగాణ/తిరుమలగిరి(సాగర్): నాటుబాంబుల మోతతో ఒక్కసారిగా కృష్ణపట్టె ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలంలోని నాయకునితండాలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్గీయులు నాటుబాంబులు, బీరుసీసాలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య గత సర్పంచ్ ఎన్నికల నుంచే వైరం నెలకొంది. […] The post తండాలో ఘర్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నాటు బాంబులు, రాళ్లు, కర్రలు,
బీరు సీసాలతో పరస్పర దాడులు
20 ఇళ్లు, 30 ద్విచక్రవాహనాలు ధ్వంసం
పలువురికి గాయాలు
భయం గుప్పిట్లో కృష్ణపట్టె గ్రామస్థులు

మన తెలంగాణ/తిరుమలగిరి(సాగర్): నాటుబాంబుల మోతతో ఒక్కసారిగా కృష్ణపట్టె ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలంలోని నాయకునితండాలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్గీయులు నాటుబాంబులు, బీరుసీసాలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య గత సర్పంచ్ ఎన్నికల నుంచే వైరం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మేరావత్ స్వామి సర్పంచ్ ఎన్నికల అనంతరం టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించాడు.

అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం ఒక శుభకార్యంలో కలుసుకున్న ఇరువర్గీయులు మేరావత్ బిచ్చాలు, మేరావత్ స్వామిల మధ్య జరిగిన సంభాషణ ఇరువర్గాల మధ్య దాడికి కారణమైనట్లు తెలుస్తోంది. అనంతరం గ్రామాల్లో చేరుకొని జరిగిన విషయాన్ని స్వామి తన కుమారులకు చెప్పడంతో అతని కుమారులు వెళ్లి మేరావత్ బిచ్చాలును అతనిపై ఇంటిపైన దాడి చేసి అతన్ని గాయపర్చారు. ఈ క్రమంలో గాయపడ్డ బిచ్చాలును కుటుంబ సభ్యులు కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ఆదివారం బిచ్చాలు గ్రామానికి చేరుకున్న అనంతరం కాంగ్రెస్ వర్గీయులు బిచ్చాలును పరామర్శించడానికి అతని ఇంటికి పెద్ద ఎత్తున వెళ్లగా అతని ఇంటి ముందు టిఆర్‌ఎస్ వర్గీయులు బైకులపై అటూ..ఇటూ తిరుగుతూ రెచ్చగొట్టడంతో వాగ్వివాదం చోటు చేసుకొని గొడవకు దారి తీసింది.

ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోగా ముడావత్ దస్లి అనే మహిళకు తీవ్ర గాయమైంది. దీంతో రెచ్చిపోయిన ఇరువర్గాల వారు బీరు సీసాలు, చేపల వేటకు ఉపయోగించే నాటుబాంబులు, కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన వారి 20 ఇండ్లు, ౩౦ ద్విచక్రవాహనాలు, గృహోపకరణలు ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం గ్రామంలో 144 సెక్షన్ విధించినట్లు సిఐ వేణుగోపాల్, ఎస్‌ఐలు కురుమయ్య, శ్రీనయ్యలు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Fight Between TRS And Congress Activists In Nalgonda 

The post తండాలో ఘర్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: