కాళేశ్వరం సంబురం…

  ఉమ్మడి జిల్లాలో ఉప్పొంగిన ఆనందం పల్లెపల్లెన పండగ వాతావరణం సిఎం చిత్రపటానికి పాలాభిషేకాలు కాళేశ్వరంలో ముగ్గురు ముఖ్యమంత్రులు సిఎం కెసిఆర్ ఆలోచనల విధానంతో నిర్మించిన బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోనే అతి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను ప్రారంభించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నెలకొన్నాయి. మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాజెక్టుల వద్ద సిఎం కెసిఆర్ దంప తులు సంకల్ప […] The post కాళేశ్వరం సంబురం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఉమ్మడి జిల్లాలో ఉప్పొంగిన ఆనందం
పల్లెపల్లెన పండగ వాతావరణం
సిఎం చిత్రపటానికి పాలాభిషేకాలు
కాళేశ్వరంలో ముగ్గురు ముఖ్యమంత్రులు

సిఎం కెసిఆర్ ఆలోచనల విధానంతో నిర్మించిన బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోనే అతి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను ప్రారంభించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నెలకొన్నాయి. మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాజెక్టుల వద్ద సిఎం కెసిఆర్ దంప తులు సంకల్ప హోమం నిర్వహించారు. సుందిళ్ల వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్, మేడారం వద్ద చామకూర మల్లారెడ్డి, లక్ష్మీపూర్ పంప్ హౌజ్ వద్ద మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అన్నారంలో హోం మంత్రి మహమ్మూద్ అలీలు ఏకకాలంలో పూజలు నిర్వహించారు. సిఎం కేసీఆర్ గుమ్మడికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. అంతకముందు కాళేశ్వరం శిలాఫలకాన్ని ఎపి సిఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవిష్కరించగా మేడిగడ్డ వద్ద గవర్నర్ నరసింహన్, సిఎంలు జగన్, దేవేంద్ర ఫడ్నవీస్‌లు కొబ్బరికాయలు కొట్టారు. సిఎంతో పాటు మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు పాల్గొని పూజలు నిర్వహించారు.

కరీంనగర్ : ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం సిఎం కేసీఆర్ ఎపి సిఎం వైయస్ జగన్, మహరాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో కలిసి ప్రారంభించారు. కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసి ప్రపంచంలోనే చరిత్రను తిరగరాసిన ఘనత సిఎం కేసీఆర్‌కే దక్కింది. ప్రాజెక్టు ప్రారంభం రోజు తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు జరుపుకోవాలని సిఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పల్లెల్లో, పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

అంతరాష్ట్ర వివాదాలను స్నేహభావంతో పరిష్కరించుకొని, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులను సాధించి, అడ్డంకులన్నింటిని చాకచక్యంతో అధిగమించి ప్రారంభానికి నోచుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందుతుంది. ప్రతి ఇంటికి ప్రతీరోజు రక్షిత మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకానికి అవసరమయిన నీటి సరఫరా కూడా ఈ ప్రాజెక్టు నుండే కేటాయించడం జరుగుతుంది. కోటి జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరానికి ప్రతీరోజూ మంచినీరు అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పరిశ్రమలకు కావలసిన 16 టిఎంసిల నీటిని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం కలుగుతుంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ సృష్టించిన కొత్త రికార్డులు:
ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా 139 మెగావాట్ల గరిష్ట సామర్థం కలిగిన పంపులను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో 203 కిలోమీటర్ల అతిపొడవైన సొరంగమార్గం ఈ ప్రాజెక్టు కోసం తవ్వారు. ప్రపంచం మొత్తంలో ఒకరోజుకి 2 టిఎంసిల నీటిని ఎత్తిపోయగలిగిన ప్రాజెక్ట్ కాళేశ్వరం మాత్రమే. దీనిని వచ్చే ఎడాది నుంచి 3 టిఎంసిల నీటిని ఎత్తిపోయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకే ఒక ప్రాజెక్ట్ ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు మంచినీరు, వందలాది పరిశ్రమలకు నీరు అందించడం ప్రపంచంలో ఇదే ప్రథమం. గోదావరి నీటిని 92 మీటర్ల ఎత్తు నుంచి వివిధ దశల్లో నీటిని ఎత్తిపోసి, ఎక్కడికక్కడ ఆయకట్టుకు నీరందిస్తూ, చివరికి 618 మీటర్ల ఎత్తువరకు నీటిని పంపడం ఇదే ప్రథమం.

ఉమ్మడి జిల్లాలో పూజలు:
సుందిళ్ల, అన్నారంల వద్ద మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమ్మూద్ అలీ, మేడారం వద్ద చామకూర మల్లారెడ్డి, లక్ష్మీపూర్ పంప్‌హౌజ్ వద్ద మంత్రి జగదీశ్వర్ రెడ్డిలు ఏకకాలంలో పూజలు నిర్వహించారు.

పల్లెపల్లెనా సంబురాలు:
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. గ్రామాల్లో రైతులతో పాటు టిఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు సంబురాలు నిర్వహించుకున్నారు. సిఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించి స్వీట్ల పంపిణీ చేశారు. అతి తక్కువ కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన ఘనత సిఎం కేసీఆర్‌దేనంటూ కొనియాడారు.

Festival Atmosphere in Villages

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాళేశ్వరం సంబురం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: