ఎరువుల అమ్మకాలలో అక్రమాలకు చెక్…

  ఆదిలాబాద్ : ఎరువుల అక్రమ అమ్మకాలు, అక్రమ నిల్వలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వ్యాపారుల పైనే కాకుండా ప్రాధమిక సహకార మార్కెటింగ్ సమాఖ్య(మార్క్‌ఫెడ్)ల పైనా నిఘా పెంచాలని అధికారులను ఆదేశించింది. ఏ రైతుకైనా తప్పనిసరిగా పాయింట్ ఆఫ్ సేల్ (పివోఎస్) యంత్రం ద్వారా ఎరువులు విక్రయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఖరీఫ్ నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వ్యాపారులంతా ఈ యంత్రాలతోనే విక్రయాలను చేపడుతున్నారు. ఈ యంత్రాల […] The post ఎరువుల అమ్మకాలలో అక్రమాలకు చెక్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్ : ఎరువుల అక్రమ అమ్మకాలు, అక్రమ నిల్వలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వ్యాపారుల పైనే కాకుండా ప్రాధమిక సహకార మార్కెటింగ్ సమాఖ్య(మార్క్‌ఫెడ్)ల పైనా నిఘా పెంచాలని అధికారులను ఆదేశించింది. ఏ రైతుకైనా తప్పనిసరిగా పాయింట్ ఆఫ్ సేల్ (పివోఎస్) యంత్రం ద్వారా ఎరువులు విక్రయించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఖరీఫ్ నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వ్యాపారులంతా ఈ యంత్రాలతోనే విక్రయాలను చేపడుతున్నారు. ఈ యంత్రాల ద్వారా అమ్మితేనే కేంద్రం నేరుగా నగదు బదిలీ విధానంతో కంపెనీలకు రాయితీలను జమ చేయనుంది. వరుసగా మూడు నెలలు ఎరువులు అమ్మని చిల్లర వ్యాపారిపై విచారణ చేపట్టనున్నారు. వ్యాపారి నెలకోసారి ఎన్ని ఎరువులు అమ్మారో తెలియజేస్తూ నివేదికను వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ శాఖ అధికారి తనిఖీ చేసినప్పుడు అక్కడ ఉన్న నిల్వలు పీవోఎస్ యంత్రంలో కనిపించే నిల్వలతో సరిపోవాలి. తేడాలుంటే వెంటనే లైసెన్సు రద్దు చేసే అధికారం ఉంటుంది.

టోకు వ్యాపారులు అధిక నిల్వలు పెట్టకుండా ఎప్పటికప్పుడు చిల్లర వ్యాపారులకు పంపాలి. వారి వద్ద ఉండే నిల్వలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాలో అత్యధికంగా ఎరువులు కొనేవారి జాబితాలు తయారు చేసి అందులో టాప్ 20 మంది వివరాలు సేకరించాలి. వారు వాటిని ఎక్కడ వినియోగిస్తున్నారో పరిశీలించాలి. ప్రతి ఎరువుల వ్యాపారి మార్క్‌ఫెడ్, ప్యాక్స్ సిబ్బంది సాగించే విక్రయాలపై నిఘా పెట్టి ఎక్కడ లొసుగులు ఉన్నావెంటనే కఠిన చర్యలు తీసుకుంటారు. రైలులో వచ్చే యూరియాలో కంపెనీలు 50 శాతం తప్పని సరిగా మార్క్‌ఫెడ్‌కే ఇవ్వాలి. వీటిని అత్యవసర సమయంలో ప్యాకస్‌ల ద్వారా రైతులకు అమ్మేందుకు నిల్వ చేస్తారు.

ఎరువులు కొన్న రైతుకు తప్ప నిసరిగా వెంటనే రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలో వానాకాలం, యాసంగిలో సాగు విస్తీర్థాన్ని బట్టి వ్యవసాయశాఖ ఎరువుల కోసం వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుంది. వీటి ఆధారంగా జిల్లాకు ఎరువులను కేటాయించేవారు. కాగా గతంలో వ్యాపారులు వానాకాలం, యాసంగి సీజన్‌లో కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో అధిక ధరలకు ఎరువులను విక్రయించే వారు. సరిపడా ఎరువులు దొరకక రైతులు రోడ్డెక్కి రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

వీటన్నింటికి చెక్ పెట్టేందుకు వ్యవసాయశాఖ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ప్రతి ఎరువుకు లెక్క తెలుసుకునేందుకు పీవోఎస్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొనివచ్చారు. వ్యాపారులతో పాటు వ్యవసాయ సహకార సంఘాలు ఎరువులు విక్రయిస్తే తప్పని సరిగా రైతు వేలిముద్ర, ఆధార్ నెంబర్‌ను పివోఎస్ మిషన్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. రైతుకు అవసరమైనన్ని ఎరువులు అమ్మాల్సి ఉంటుంది.

డీలర్‌కు ఎంత స్టాక్ వచ్చింది. ఎంత ఎరువులు విక్రయాలు జరిగాయి. ఈ పీవోఎస్ మిషన్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఈ నూతన విధానంతో అక్రమ అమ్మకాలు, అక్రమ నిల్వలకు బ్రేక్ పడునుంది. ఇక రైతు ఎప్పుడు వెళ్లినా ఎరువులు లభిస్తాయని అంటున్నారు. ఇక ధరల విషయంలోనూ రైతులను మోసం చేసే అవకాశం లేకపోవడంతో వ్యాపారులు ఎలాంటి అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉండవని అంటున్నారు.

Fertilizer should be sold through POS Machine

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎరువుల అమ్మకాలలో అక్రమాలకు చెక్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: